అన్నింటిలోనూ మేమే జోక్యం చేసుకోవాలా?
ఉన్నతాధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: “పాలనాధికారుల్లో ఉదాసీనత ఆవరించింది, అన్నీ కోర్టులకే వదిలేసేంతగా పట్టనితనం వచ్చింది” అని సర్వోన్నత న్యాయస్థానం పాలనావ్యవస్థపై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. “బ్రేకులు వెయ్యడం, మంటలు ఆర్ప డం దగ్గర నుండీ అన్నీ మేమే చెప్పాల్సి వస్తోంది, మీరేం చేస్తున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఏర్పడిన గాలి కాలు ష్యం అత్యవసర పరిస్థితి కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గాలి కాలుష్య నియంత్రణకు ఉన్నతాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో చక్కగా అమలయ్యేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేశా రు. గాలి కాలుష్య నియంత్రణపై నిర్దేశిత చర్య లు అమలు జరుగుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భరోసా కలిగించాలని కో రారు. తాము ఈ గాలి కాలుష్యానికి సంబంధించిన మౌలిక వాస్తవాలు, ఇతర వివరాల జోలికి వెళ్ళదల్చుకోలేదని చెబుతూ, పాలనావ్యవస్థలో ఉండే అధికారులు సత్వరం స్పందించి నిర్ణయా లు తీసుకోవడం లేదని, వారిలో ఒకరకమైన ఉదాసీనత, మండకొడితన ఆవరించిందని మండలించింది. పరిపాలనావ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలను కూడా కోర్టులకే వదిలేసేంతగా అధికారులను మందకొడితనం ఆవరించిందని విమర్శించింది. సుమారు రెండు గంటలపాటు ఢిల్లీ గాలి కాలుష్యంపై విచారణ కొనసాగింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అధికారులకు ఇలా చీవాట్లు వేసింది. ఢిల్లీ గాలి కాలుష్యంపై కోర్టు రెండు వారాల వ్యవధిలోనే నాలుగు సార్లు అత్యవసరంగా విచారణ జరిపింది. దీపావళి మరునాటి నుండి ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలో అనూహ్యమైన రీతిలో గాలి కాలుష్యం ఆవరించడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అప్పటినుండి గాలి కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పర్యవేక్షిస్తూ, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేస్తూ వచ్చింది. రైతుల వ్యర్థాల దగ్ధంపైనే ఆరోపణలు చేయకుండా ఢిల్లీ నగరంలో వాహనాల రాకపోకల నియంత్రణ, ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు వంటి ప్రత్యామ్నాయ నియంత్రణ చర్యలపై దృష్టి కేంద్రీకరించాలని వీలైతే కొద్ది రోజులు లాక్‌డౌన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనమే స్వయంగా ప్రతిపాదనలు చేసి మార్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చింది. సుప్రీం ధర్మాసనం దిశానిరేశం మేరకే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కూడా గడచిన సోమవారం హుటాహుటిన ఉన్నతాధికారులతో సమావేశమై చర్యలకు సిద్ధమైంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున బుధవారంనాడు జరిగిన విచారణకు హాజరై పలు నియంత్రణ చర్యల జాబితాను జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనానికి సమర్పించారు. ఎస్‌ఆర్ పరిధిలోని ఐదు ధర్మల్ కేంద్రాలు, స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు, గ్రంథాలయాల మూసివేత, నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం, 1000 సిఎన్‌జి బస్సులను ప్రవేశపెట్టడం, నిత్యావసరాల రవాణా వాహనాలను మాత్రమే అనుమతించడం వంటి పలు చర్యల జాబితాను కేంద్రం సుప్రీంకు సమర్పించింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ, రాజ్యాంగంలోని పాలనా వ్యవస్థ తన విధులను కోర్టు ఉత్తర్వులకు వదిలేయకూడదని హితవు చెప్పింది.
కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతరులు దాఖలు చేసిన అఫిడవిట్లను ధర్మాసనం తొలుత ప్రస్తావిస్తూ పాలనావ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది. “ఒక న్యాయమూర్తి,గా, ఒక అడ్వకేట్ జనరల్‌గా గడచిన కొంతకాలంగా నేను పరిశీలించినది ఏమిటంటే, బ్యూరోక్రసీ (పాలనాధికార వ్యవస్థ)లో సంపూర్ణంగా…నా ఉద్దేశం ప్రకారం ఒక రకమైన మండకొడితనం, జడత్వం ఆవరించింది, పాలనాధికారులు తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకోవడం లేదు, తీసుకోవడం లేదు, ఒక కారును ఎలా ఆపాలి? ఒక వాహనాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి? ఒక అగ్ని ప్రమాదంలో మంటలను ఎలా చల్లార్చాలి? వంటి విషయాలన్నింటినీ న్యాయస్థానమే చేయాల్సి వస్తోంది..! ప్రతీదీ మేమే చేయాల్సి వస్తోంది!! మన కార్యనిర్వాహక వ్యవస్థలో అభవృద్ధి చెందిన వైఖరి ఇలా ఉంది!!” అని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు. “ఇది కేవలం ఉదాసీనత, వట్టి ఉదాసీనత, (నిరాసక్తత, అలసత్వం, అనాసక్తి…)” అని జస్టిస్ రమణ పేర్కొంటూ ఈ కేసు విచారణను తదుపరి ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.
అప్పటివరకూ ఢిల్లీలో గాలి కాలుష్యానికి చుట్టుపక్కల రాష్ట్రాలలో రైతులు దగం చేస్తున్న వ్యవసాయ వ్యర్థాలు, దీపావళి బాణసంచా ప్రధాన కారణమని అధికారులు న్యాయస్థానానికి చెబుతూ వచ్చారు. ఆ తర్వాత నిజనిర్ధారణలో వ్యవసాయ వ్యర్థాల వల్ల ఎన్‌సిఆర్ పరిధిలో కేవలం పదీ శాతం మాత్రమే గాలి కాలుష్య నష్టం కలుగుతుందనీ, అదీ ఏడాదిలో ఒక్కసారి మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, కేంద్ర ప్రభుత్వం తరపున ఈ కేసు విచారణకు హారైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా చివరకు రైతులవల్ల మొత్తంగా కేవలం నాలుగూ లేదా ఐదూ శాతం కాలుష్యం మాత్రమే కలుగుతోందని సర్వోన్నత న్యాయస్థానం ఎదుట అంగీకరించారు. టీవీ చర్చల్లో ఈ సమస్యపై రోతపుట్టించేవిధంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవసాయ వ్యర్థాలపై జరిగిన చర్చలు తాను సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేస్థితికి వచ్చిందని ఆయన వాపోయారు. అందుకు ధర్మాసనం కూడా టీవీ చర్చలపై నిశిత విమర్శలు చేసింది. వాస్తవాలు స్పష్టమైనందువల్ల ఇక ఢిల్లీ గాలి కాలుష్య నియంత్రణకు కోర్టుల జోక్యం, కోర్టు ఉత్తర్వులతో పని లేకుండా అధికారులు ప్రజలకు భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం హితవు చెప్పింది. సుమారు రెండు గంటలపాటు ఢిల్లీ గాలి కాలుష్యంపై విచారణ కొనసాగింది. “సరే అయ్యిందేదో అయ్యింది, ఇక ఆ సమస్యల వివరాల్లోకి, లోతుల్లోకీ మేం వెళ్ళదలుచుకోలేదు, ప్రస్తుతం దేశ రాజధానిలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి” అని ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌కు తెలియజేసింది.
మీరేం చేస్తున్నారు!
RELATED ARTICLES