న్యూఢిల్లీ: ‘ది ఈగాట్ కప్’లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ సాయికోమ్ మీరాబాయి చాను స్వర్ణ పతకం గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ‘ది ఈగాట్ కప్’లో చాను 48 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి పసిడి కైవసం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 192 కేజీల బరువు ఎత్తింది. అందులో స్నాట్చ్‌లో 82 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కేజీలు ఎత్తి తన విభాగంలో తొలి స్థానంలో నిలిచింది. వరల్డ్ చాంపియన్ మీరాబాయి చాను మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2017లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి చాను (196 కేజీలు) ఎత్తి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. గాయం కారణంగా గత ఏడాది సగం సీజన్‌కు దూరంగా నిలించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన తొలి బంగారు పతకాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని చాను పేర్కొంది. ప్రస్తుతం తాను వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నానని చెప్పింది. తర్వాతే జరిగే ఈవెంట్లలో కూడా భారత్‌కు మరిన్ని పతకాలు అందిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. 2020 ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే తన ముందున్న పెద్ద లక్ష్యమని 24 ఏళ్ల మనీపురి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చెప్పింది.
మీరాబాయి చానుకు స్వర్ణం
RELATED ARTICLES