సిట్ దర్యాప్తు ముగిసే వరకూ అంతే…
హత్రాస్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
టిఎంసి ఎంపిల అడ్డగింత, కిందపడిన డెరెక్
న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ఆందోళన
యుపి ప్రభుత్వ బర్తరఫ్‌కు డిమాండ్
న్యూఢిల్లీ / హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతమంతర్ వద్దకు సామాజిక కార్యకర్త లు, విద్యార్థులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని నిరసన తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఏం జరుగుతుందని ప్రశ్నించారు. హత్రాస్‌ను పోలీసులు చుట్టుముట్టారని, ప్రతిపక్ష నాయకులను, మీడియాను అనుమతిండం లేదని మండిపడ్డా రు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ హత్రాస్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు మౌనం వహించిందో తెలపాలని నిలదీశారు. యుపి ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం ఆ నేరాన్ని సమర్థించడమేనన్నారు. యోగి ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హతను కోల్పోయిందని, న్యాయం జరగాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భారత రాజ్యాంగం అమల్లో లేదని, కులస్మృతి అమల్లో ఉందని ఆరోపించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ దర్యాప్తు ముగిసే వరకూ హత్రాస్ లోకి మీడియాపై ఆంక్షలుంటాయని పోలీసులు స్పష్టం చేశారు. హత్రాస్‌లోకి మీడియాను అనుమతించడం లేదని, 144 సెక్షన్ విధించారని ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో పోలీసుల ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. “సిట్ దర్యాప్తు ముగిసే వరకూ హత్రాస్ గ్రామంలోకి మీడియాను అనుమతించం. శాంతిభద్రతల దృష్ట్యా నిరసన కార్యక్రమాలకు, రాజకీయ నేతల పర్యటనలపై కూడా నిషేధం కొనసాగుతుంది” అని స్థానిక అడిషనల్ ఎస్‌పి ప్రకాశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు తమను మీడియాతో మాట్లాడడానికి అనుమతించడం లేదని హత్రాస్ బాధిత కుటుంబీకులు మండిపడుతున్నారు. “నా ఫోన్‌ను పోలీసులు తీసుకున్నారు. మీడియాతో ఈ విషయం చెప్పాలని కుటుంబీకులు నన్ను పంపారు. దాక్కోని.. దాక్కోని.. మీడియా ముందుకు వచ్చా. మీడియాను లోపలికి అనుమతించరు. మమ్మల్ని బయటికి అనుమతించరు. పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు.” అని బాధిత కుటుంబీకులు పేర్కొన్నారు.
టిఎంసి ఎంపిలను అడ్డుకున్న పోలీసులు
హత్రాస్ అత్యాచార యువతి అత్యాచారానికి గురైన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ దళిత యువతి మృతి, తదనంతర పరిణామాలతో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు గురుఆరం ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకకు పోలీసుల నుంచి ఎదురైన అనుభవమే తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలకూ ఎదురైంది. హత్రాస్ గ్రామం సమీపంలోకి వెళ్లిన తృణమూల్ ఎంపి డెరెక్ ఓబ్రియన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించబోమన్నారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం, తోపులాటలో ఎంపి డెరిక్ ఓబ్రియన్ కింద పడిపోయారు. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు తమను గ్రామంలోకి అనుమతించాలని మహిళా ఎంపిలు చేతులు జోడించి కోరినా పోలీసులు వినలేదని టిఎంసి ఎపి ఒకరు చెప్పారు. తృణమూల్ ఎంపిలు ప్రతిమ మండల, కకోలి ఘోష్ దస్తిదర్, మాజీ ఎంపి మమతా ఠాకూర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కనీసం మహిళలనైనా గ్రామంలోకి అనుమతించాలని ఓబ్రెయిన్ కోరినా వినని పోలీసులు.. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. మహిళా నేతల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపిలు, తృణమూల్ నేతలు బాధితురాలి నివాసానికి కి.మీ దూరంలో బైఠాయించారు. మరోవైపు బాధితురాలి కుటుంబం అనుమతిలేకుండా రాత్రికి రాత్రికే బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా గురువారం స్వీకరించింది. అక్టోబర్ 12 న తదుపరి విచారణకు రాష్ట్ర, జిల్లా అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించింది.
మీడియాపై ఆంక్షలు
RELATED ARTICLES