జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆరోపణ
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన కొన్ని రోజులకే జస్టిస్ కురియన్ జోసెఫ్ సంచలనాత్మక వ్యాఖ్య లు చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయాధికారి దీపక్ మిశ్రా బాహ్య శక్తుల ప్రభావంతో పనిచేశారని, దానివల్ల న్యాయ పరిపాలన ప్రభావితం అయిందన్నారు. నలుగురు జడ్జీలు జనవరిలో అ నూహ్యంగా నిర్వహించిన విలేకరుల సమావేశం లో కురియన్ కూడా ఒకరు. జనవరి 12న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు జె చలమేశ్వర్, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మదన్ లోకుర్లతో కలిసి కురియన్ భార త ప్రధాన న్యాయమూర్తి మిశ్రాకు వ్యతిరేకంగా బహిరంగ తిరుగుబాటు చేశారు. సున్నితమైన కేసుల్ని జూనియర్ న్యాయమూర్తులకు కేటాయిస్తున్నారన్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ప్రధాన న్యాయమూర్తి కొన్ని బా హ్య వర్గాల ప్రభావంతో పనిచేశారు. బాహ్య శక్తు లు ఆయన్ని రిమోట్ ద్వారా కంట్రోల్ చేశాయి. న్యాయ పరిపాలన విషయంలో కొన్ని బాహ్య వర్గాల ప్రభావం ఉంటోంది’ అని జోసెఫ్ చెప్పా రు. ఆయన నవంబర్ 29న రిటైర్ అయ్యారు. ‘ఏ ఆధారంతో ఈ ఆరోపణ చేస్తున్నారు?’ అని ప్రశ్నించినప్పుడు ‘ఇది న్యాయమూర్తులో ఉన్న భావన’ అని జవాబిచ్చారు. బాహ్య వర్గాల గురిం చి ఆయన వివరించలేదు. పక్షపాతమున్న కేసు ల్లో న్యాయ పరిపాలన ప్రభావితమైందని మాత్రం చెప్పారు. ‘ఏదేని కేసులో బాహ్య వర్గాల ప్రభావం అంటే కొన్ని రాజకీయ పార్టీల లేక ప్రభుత్వం ప్ర భావం ఉందా?’ అని అడిగినప్పుడు ‘కొన్ని తీర్పు ల్లో పక్షపాతం ఉందన్నదే న్యాయమూర్తుల్లో ఏర్పడిన భావన’ అని జవాబిచ్చారు. ప్రత్యేకించి ఏ ఒ క్క కేసును ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదన్నారు. ‘దీనిని ఇంకా ముందుకు తీసుకుపోవడం కూడా నాకిష్టంలేదు’ అన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధా న న్యాయమూర్తి దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం భారత ప్రధాన న్యా యమూర్తిగా గొగోయ్ ఉన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని నాడు జస్టిస్ జోసెఫ్ ఎన్డిటివికి చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి బాహ్య శక్తుల ప్రభావానికి ప్రభావితులయ్యారని భావించాకే విలేకరుల సమావేశాన్ని నాడు నలుగురు న్యాయమూర్తులు నిర్వహించినట్లు కురియన్ తెలిపారు. న్యాయమూర్తి బి హెచ్ లోయ మరణం కేసులో పునఃదర్యాప్తు పిటీషన్ల కేటాయింపును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సిబిఐ ప్రత్యేక జడ్జి లోయ మరణంపై దాఖలైన పిటిషన్లను ఏప్రి ల్ 19న సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయన స హజంగానే మరణించారని తీర్పు చెప్పింది. సోహ్రబుద్దీన్ షేఖ్ బూటకపు ఎన్కౌంటర్ కేసును లోయ విచారించారు. తన సహచరుడి కూతురు పెళ్ళికి వెళ్లిన లోయ నాగ్‌పూర్‌లో 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో చనిపోయారు. ఆయన విచారిస్తున్న కేసులో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తదితరులున్నారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ సమయంలో అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా పనిచేశారు. ఆ కేసులో విచారణ కోర్టు ఆయనను నిర్దోషిగా విముక్తిని చేసింది