ధర పతనానికి అకాల వర్షాలు తోడు
తాలుగా మారుతుందన్న ఆందోళనలో రైతన్నలు
పట్టాల పంపిణీలో వ్యవసాయ శాఖ విఫలం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: మిర్చి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ధర లేక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షాలకు కల్లాల్లోని మిర్చి పూర్తిగా తడిసిపోయింది. రాత్రి వేళల్లో వర్షం పడడంతో రైతులు మిర్చి పోగుచేసి పట్టాలు కప్పే సమయం కూడా లేదు. తడిసిన మిర్చి రంగు మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లోని మిర్చితో పాటు మిర్చి తోటల్లో చెట్లకు ఉన్న కాయలు కూడా తడిస్తే రంగు మారతాయ ని ఎక్కువ భాగం తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రతియేటా అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా మిర్చి రైతులకు పట్టా లు అందించడంలో మాత్రం వ్యవసాయ శాఖ ఘోరం గా విఫలమవుతున్నాయి. సబ్సిడీపై రైతులకు అందించాల్సిన పట్టాలు రైతులకు చేరకుండా పక్కదారి పడుతున్నాయి. తడిసిన మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యా పారులు ముందుకు రావడం లేదు.ప్రతియేటా ఈ సమయంలో అకాల వర్షాలు రావడం మిర్చి తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అడిగిన ధరకు విక్రయించాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ ఏడాది మిర్చి మొక్క నాటింది మొదలు తెగుళ్లు పంట ను పట్టి పీడించడంతో పెట్టుబడులు విపరీతంగా పెరగాయి.ముఖ్యంగా దొప్ప తెగుళ్లకే వేల రూపాయల క్రి మి సంహారక మందులను ఉపయోగించాల్సి వచ్చింది. గతేడాదితో పోల్చినప్పుడు పెట్టుబడి దాదాపు రెట్టింపు అయింది. ఇదే సమయంలో 2020 జనవరిలో క్వింటా రూ.20వేల పైచిలుకు ధర పలికిన మిర్చి పంట రైతుల చేతికి వచ్చి మార్కెట్‌కు తీసుకెళ్లే సమయానికి క్రమేపి తగ్గుతూ వచ్చింది. ప్రథమశ్రేణి నాణ్యత కలిగిన మిర్చిని కూడా రూ.13వేలకు మించి కొనుగోలు చేయ డం లేదు.ధర లేక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క అకా ల వర్షాలు దెబ్బతీశాయి.మిర్చి రైతులను ప్రభు త్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మిర్చి రైతు కంట కన్నీరు
RELATED ARTICLES