పారిస్: భారత దేశం తిరుగులేని యుద్ధ సామర్థ్యాన్ని సొంతం చేసుకోబోతోంది. గగనతల యుద్ధంలో ఎదురులేని శక్తి కాబోతోంది. ఐరోపాకు చెందిన క్షిపణి తయారీ సంస్థ ‘ఎంబిడిఎ’ దీనికి సంబంధించిన వి వరాలను వెల్లడించింది. ఫ్రాన్స్ నుం చి 36 రాఫెల్ యుద్ధ్ద విమానాలను భారత దేశం కొనుగో లు చేస్తోంది. వీటిలో మొదటి యుద్ధ విమానాన్ని మంగళవారం భారత దేశానికి డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ అప్పగించబోతోంది. ఈ విమానాలకు మిటియెర్, స్కాల్ప్ క్షిపణులు ఉంటాయి. ఎంబిడిఎ ఇండియా చీఫ్ లోయిక్ పీడెవాచే పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ భారత దేశం మునుపెన్నడూ లేనంత యుద్ధ సామర్థ్యాన్ని సాధించబోతోందన్నా రు. రాఫెల్ యుద్ధ విమానాలతో కొత్త సామర్థ్యాలను భార త్ సొంతం చేసుకుంటుందన్నారు. భారత వాయు సేనకు స్కాల్ప్, మిటియెర్ క్షిపణులు సామర్థ్యాన్ని సమూలంగా మార్చే సాధనాలు(గేమ్ చేంజర్) అవుతాయని చెప్పారు. ఈ విమానాలకు అత్యాధునిక, అత్యంత మేలైన ఆయుధాలను అమర్చుతున్నట్లు తెలిపారు. చాలా ముఖ్యమైన మార్కెట్లలో ఈ ప్యాకేజ్ ఘన విజయాలు సాధించిందని చెప్పారు. ఒప్పందంలో భాగంగా మొదటి యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్వీకరిస్తారు. పా రిస్‌లోని ఓ వైమానిక స్థావరంలో జరిగే కార్యక్రమంలో దీనిని స్వీకరిస్తారు. మూడేళ్ళ క్రితం ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌తో భారత దేశం ఒప్పందం కుదుర్చుకుంది.
మిటియెర్, స్కాల్ప్ క్షిపణులున్న రాఫెల్ విమానాలు భారత్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతాయి
RELATED ARTICLES