జిఎస్‌టి గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో తెలంగాణ డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రూ.25.58 వేల ఐజిఎస్‌టి మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ జిఎస్‌టి కౌన్సిల్‌కు సిఫారసు చేయాలన్నారు. తెలంగాణకు ఐజిఎస్‌టి కింద రావాల్సిన రూ.2638 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజిఎస్‌టి మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్రానికి ఎంత ఐజిఎస్‌టి రావాల్సి ఉందనే విషయంపై తమకు స్పష్టత ఉందన్నారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో గురువారం ఐజిఎస్‌టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సమావేశంలో గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యులైన ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, పంజాబ్, తమిళనాడు, ఒడిశా ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఐజిఎస్‌టి సెటిల్‌మెంట్‌పై ప్రధానంగా చర్చించారు. గతంలో ఈ మొత్తాన్ని రూ.25.58 కోట్ల కన్సాలిడేటెడ్ ఫండ్‌లో నిబంధలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్‌లో కాగ్ ఎత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. కాగ్ సైతం ఈ విషయంలో తప్పు పట్టినందున ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నెల ఐదో తేదీన జరిగే జిఎస్‌టి కౌన్సిల్ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు. అందుకు ఐజిఎస్‌టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కన్వీనర్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ అంగీకారం తెలుపుతూ రాష్ట్రాలకు ఐజిఎస్‌టి మొత్తం ఇవ్వాలనే సిఫారసును వెంటనే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 2017- తిరిగి 2018- ఇదే తప్పు జరిగిందన్న విషయాన్ని కాగ్ ఇటీవల పార్లమెంట్‌లో బహిర్గతం చేసిందని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రస్తావించారు. 208-19లో రూ.13,944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయడాన్ని కాగ్ మరో మారు తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని, అందులో భాగంగా తెలంగాణకు రూ.210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఐజిఎస్‌టిలో ‘సెటిల్‌మెంట్ బేస్డ్ ఆన్ యాన్వల్ రిటర్న్’ కింద రాష్ట్రానికి మరో రూ.1000 కోట్లు రావాల్సి ఉందని, జిఎస్‌టి ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి హరీష్‌రావు కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య, పన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
మా వాటా మాకివ్వండి!
RELATED ARTICLES