ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో : మాస్క్ అంటే.. ఇప్పటి వరకు అతి కొద్ది మందికే తెలుసు. దాని గురించి తెలిసినా వాడకం అంతంత మాత్రమే. వీటిని ముఖ్యం గా మహానగరాలతో పాటు ఆసుపత్రిలో వైద్యు లు, సిబ్బంది మాత్రమే వాడుతారు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ పేరు తెలియని వారికి కూడా తెలిసిపోయింది. దాని వల్ల కలిగే ప్రయోజనం అందరూ తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలతో పాటు జనసందోహాం ఉండే సినిమా హాళ్లు, బార్లు, జిమ్ సెంటర్స్ తదితర వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వైరస్ వల్ల కలిగే నష్టం ఎంటో సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. దీని నివారణ కోసం మాస్క్‌ను మూతికి అడ్డం పెట్టుకోవాలని పదేపదే చెబుతున్నా ఇన్ని రోజులు మాస్క్ అంటే పట్టించుకోని వారు.. ఇప్పుడు వాటి కోసం ‘మాస్క్ అమ్మ నీవ్వు ఎక్కడ…’ అంటూ మెడికల్ షాపు ల చుట్టు చక్కర్లు కోడుతున్నారు. ఇన్ని రోజులు మాస్క్‌లను నిర్లక్ష్యం చేయడంతో మాస్కా మాజాక అనేది అందరికి అర్థమైంది. దీనిని కొనుగోలు చేద్దామని మెడికల్ దుకాణాలకు వెళ్లినా ఇప్పుడు దొరకని పరిస్థితి.. అవి దొరికినా రూ. 3 ఉన్న మాస్క్ రూ. 30లకు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇవి కూడా వారికి దగ్గర సంబంధాలు ఉన్నవారికే ఇస్తున్నారు. తెలియని వారికి లేవనే చెబుతున్నారు. కరోనా భయంతో కంగారుపడుతున్న జనం మాస్క్‌ల కోసం మెడికల్ షాపులకు ఎగబడుతుండటంతో ఇదే అదును చూసిన నిర్వాహకులు ప్రజల నుండి ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారు. కరోనా వైరస్ నివారణకు వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతూనే ప్రజలకు వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. దానిని ఎలా అడ్డుకోవాలనే విష యం ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు విధిగా మాస్క్‌లను మూతికి కట్టుకోవాలని, దగ్గినా, తుమ్మినా చేతు రుమాలు అడ్డుపెట్టుకోవాలని, చేతులను శుభ్రంగా ఎప్పడికప్పుడు కడుకోవాలని సూచనలు చేయడం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ధరించాలని తెలియపరుస్తున్నా సూర్యాపేట జిల్లాలో ప్రజలు మాత్రం కరోనా వైరస్ అంటే అంతగా పట్టించుకోలేదు. మాస్క్‌లు ధరించాలని వైద్యులు సలహాలు ఇచ్చిన వారి చెవులకు ఎక్కని పరిర్థితి. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థల మూసివేత, ఆటలు, ఉత్సవాలు, సంబరాలు బంద్ పెట్టాలని ఆదేశిస్తూ శనివారం రాత్రి సిఎం కెసిఆర్ ఈ నెల 31వరకు సెలవులు ప్రకటించడంతో కరోనా వైరస్ ప్రభావం ఎంత ఉందో తెలిపోయింది. ప్రజలు కరోనాపై మరింత కంగారు పడుతున్నారు. దీం తో జిల్లా వాసులకు పూర్తిగా తెలిసి వచ్చి బతుకు జీవు డా… అంటూ తమ ప్రాణ రక్షణ కోసం వ్యాధి సోకకుం డా జాగత్రలు పడుతున్నారు. ఇంటి నుండి వివిధ పనులకు వెళ్లే వారు వైరస్ నుండి రక్షణ పొందేందుకు గతం లో వాడని మాస్క్‌లను ధరిస్తున్నారు. దీంతో మాస్క్‌ల కోసం మెడికల్ షాపులకు పరుగులు తీసున్నారు.
మాస్క్.. మాస్క్.. చీకటిలో…!
RELATED ARTICLES