‘స్ట్రెయిన్’ వైరస్‌కూ అదే మందు
అంతుచిక్కని కొత్త కరోనా రూపం
భారత్‌లోకి ఇంకా రాలేదంటున్న ప్రభుత్వం
16 మంది బ్రిటన్ ప్రయాణికులకు పాజిటివ్
ఇండియా విమానాశ్రయాల్లో భయం భయం
న్యూఢిల్లీ : కొత్తరకం కరోనా వైరస్ ‘స్ట్రెయిన్’ మరింత కలవరపెడుతోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలలో ఈ కొత్త వైరస్ 75 తీవ్రంగా వ్యాప్తిచెందుతున్నదని శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో అన్ని దేశాలు అప్రమత్తమైన విషయం తెల్సిందే. శానిటైజర్లు, మాస్కులే శరణ్యమని నిపుణులు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) కూడా ఇదే విషయాన్ని రూఢిచేసింది. కొవిడ్ 19ను అదుపు చేయడానికి శానిటైజేషన్, మాస్కు ల వినియోగం, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించామని, కాకపోతే కరోనా తగ్గుముఖం పట్టిందని భావించిన తర్వాత వీటి వినియోగం 60 శాతం తగ్గిపోయిందని, అయితే స్ట్రెయిన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మళ్లీ నూటికి నూరు శాతం లాక్‌డౌన్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలనే పునరావృతం చేయాల్సిన అవసరం వుందని వైద్య నిపుణులు వివరించారు. స్ట్రెయిన్ ఇంకా భారత్‌లోకి ప్రవేశించలేదని కేం ద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, బ్రిటన్ నుంచి వచ్చిన 16 మంది ప్రయాణికులకు పాజిటివ్ రావడంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయా ల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
భారత్‌లో కొత్త కరోనా లేదు: కేంద్రం
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని కేంద్రం తాజాగా నాడు ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో నీతీ అయోగ్ సభ్యుడు డా. వికె పాల్ ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు కూడా వికె పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కరోనాలోని జన్యుమార్పులు..వ్యాధి తీవ్రతపై అవి చూపే ప్రభావం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మార్పుల వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని, అయితే..వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేష్ భూషన్ తెలిపారు. అయితే..ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాము వెయ్యికి పైగా కేసుల్లో కరోనా శాంపిళ్లను పరీక్షించినా గానీ.. కొత్త కరోనా ఆనవాళ్లు కనిపించలేదని ఆయన తెలిపారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే అనేక బ్రిటన్‌కు విమానసర్వీసులను డిసెంబర్ 31 వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే.
బ్రిటన్ నుంచి వచ్చిన 16 మందికి పాజిటివ్
యుకెలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దేశానికి వచ్చిన ప్రయాణికులు, సిబ్బందిలో 16 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఓ అధికారి మంగళవారం తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారంతా గత రాత్రి యుకె నుంచి దేశానికి చేరిన వారు. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో 266 మంది ప్రయాణికులు, సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇందులో ఐదుగురు పాజిటివ్‌గా పరీక్షించారు. అలాగే చెన్నైకి వచ్చిన వారిలో ఒకరి, పశ్చిమబెంగాల్ వచ్చిన వారిలో ఇద్దరికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అలాగే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలో 250 మంది ప్రయాణికులు, 22 సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురు ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నమూనాలను సేకరించి.. కొత్త కరోనా కొత్త జాతేనా? కాదా? అని తెలుసుకునేందుకు ఎన్‌సిడిసికి పంపారు. అనంతరం వైరస్ సోకిన వారందరికీ సంరక్షణ కేంద్రాలకు తరలించారు. కరోనా కొత్త వైరస్‌ను కనుగొన్న నేపథ్యంలో యుకె నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులను డిసెంబర్ చివరి వరకు కేంద్రం నిషేధించింది. ఈ క్రమంలో మంగళవారం పెద్ద ఎత్తున యుకెలోని వివిధ ప్రాంతాల నుంచి భారత్‌కు చేరారు. వీరందరికీ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చెన్నైలో లండన్ నుంచి 14 మందిని పరిశీలనలో ఉంచారు. లండన్ ప్రయాణ సంబంధం ఉన్న 1088 పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. మరో వైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్వాస్థ భవన్‌లో కొత్త కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సమావేశం అవుతుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. యుకె నుంచి తిరిగి వచ్చిన విద్యార్థికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే పలువురు విద్యార్థులు సైతం తిరిగి వచ్చిన వారిలో ఉన్నారు. అయితే కొత్త వైరస్ రోగులను ఎంత మేర ప్రభావితం చేస్తుందనే విషయం తెలియలేదని, బెలియాఘాటా ఐడి హాస్పిటల్‌కు చెందిన అంటు వ్యాధుల నిపుణుడు యోగిరాజ్ రే చెప్పారు. ఇదిలా ఉండగా, కరోనా కొత్త రకం భయాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఇంటింటి సర్వేకు సిద్ధమైంది. గత రెండు వారాలుగా యుకె నుంచి నగరానికి వచ్చిన అందరి ఇళ్లకు వెళ్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. యుకె నుంచి వచ్చినవారు వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గత 15 రోజులుగా యుకె నుంచి నగరానికి వచ్చినవారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. మహరాష్ట్రలోని అన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. పంజాబ్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్-టిపిసిఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. పాజిటివ్ వచ్చిన వారిని సంస్థాగత క్వారంటైన్‌కు తరలించనున్నారు. అంతేగాక, ఇప్పటికే యుకె నుంచి తెలంగాణకు వచ్చిన వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది.
మాస్కులే శరణ్యం!
RELATED ARTICLES