ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గురువారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఫస్ట్ లాంగ్వేజీ తెలుగు పరీక్షకు విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు పాటించి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులు 5,10,461 మంది ఉండగా, 5,08,457 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2,004 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అయితే ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ ఘటనలు జరగలేదని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపింది. మొత్తం 2,530 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. కాగా, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. మాస్కులు ధరించి ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరయ్యారు. వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వారిని జాగ్రత్తా పంపిస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు ఆదేశాల ప్రకారం విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు. శానిటైజర్లు, నీళ్ల బాటిల్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల వద్ద మాస్కులతో విద్యార్థులు దర్శనమిచ్చారు. కొంతమంది విద్యార్థులు మాత్రం చేతులను శుభ్రంగా కడుక్కొని పరీక్ష హాలుకు వెళ్లారు. దీంతోపాటు ఇన్విజిలేటర్లు కూడా మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో లిక్విడ్ సోప్స్ శానిటైజర్లను విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచారు.
మాస్కులతో పరీక్షలకు!
RELATED ARTICLES