బ్రిటన్‌కోర్టు ఆదేశం
ఆర్థిక నేరగాడిగా ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు వెల్లడి
లండన్: లిక్కర్ డాన్,వ్యాపారవేత్త,బ్యాంకులకు రూ.9వేల కోట్ల ఎగవేతదారుడు విజయ్ మా ల్యాకు బ్రిటన్ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిం ది. మాల్యాను తమకు అప్పగించాలన్న భారత్ వాదనను యూకేలోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు సమర్థించింది. ఈ మేరకు వెస్ట్‌మినిస్టర్ కోర్టు సోమవా రం సంచలన తీర్పును వెల్లడించింది. విజయ్‌మా ల్యా వ్యాపార లావాదేవీల్లో అక్రమాలు జరిగిన ట్లు తెలిసింది. మాల్యా బ్యాంకుల నుంచి రుణాల పొందే విషయంలో వరుస అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. మాల్యా బ్యాంకుల నుంచి రుణాలను పొందే సమయంలో తప్పుడు పత్రాలను స మర్పించినట్లు వెల్లడించింది. మాల్యా అప్పగింత కు సంబంధించి తన తీర్పును యూకె హోంశాఖ కు పంపుతున్నట్లు తెలిపింది. అంతేకాక మాల్యా గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టున సందర్భంగా వి ధించిన బెయిల్ షరతులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక కోర్టు తీసుకున్న నిర్ణయం పై యూకె హోంశాఖ కార్యదర్శి భారత్‌కు అప్పగించాలని సంతకం పెట్టిన 28 రోజుల లోపు మాల్యా హైకోర్టులో అప్పీల్ చేసుకోకపోతే ఆయనను హోంశాఖ భారత్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది.
వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పును స్వాగతించిన సిబిఐ
వ్యాపారవేత్త మాల్యా కేసులో యూకెలోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సిబిఐ హర్షవ్యక్తం చే సింది. న్యాయస్థానం వెల్లడించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. మాల్యాను త్వరలోనే భారత్‌కు రప్పించి.. రుణాల ఎగవేతకు సంబంధించిన కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని ఓ సిబిఐ అ ధికారి తెలిపారు. ఈ విషయంలో చాలా కాలం గా మాల్యాను భారత్ రప్పించేందుకు అన్ని రకా ల ప్రయత్నాలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్డర్ జైలును సిద్ధం
ఇక మాల్యాను భారత్‌కు వస్తే సిబిఐ ఆయన కో సం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసింది. మాల్యాను కట్టుదిట్టమైన భద్రత ఉండే ముంబయిలోని ఆర్డర్ రోడ్డు జైలులో ఉంచేందుకు ఏర్పా ట్లు చేసింది. ఇందుకోసం ఆయనకు జైలులోని బ రాక్ 12ను కూడా కేటాయించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సిబిఐ ఇంత కు ముందే బ్రిటన్ న్యాయస్థానానికి అందించింది.