HomeMost Trendingమార్స్‌పై భూకంప లేఖిని!

మార్స్‌పై భూకంప లేఖిని!

వాషింగ్టన్‌ : నాసాకు చెందిన కొత్త ల్యాండర్‌ ఇన్‌సైట్‌ కొన్ని రోజుల క్రితం మార్స్‌ (అంగారక గ్రహం)పై అడుగుపెట్టిన విషయం అందరికీ తెల్సిందే. తాజాగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ తన వద్ద వున్న క్వేక్‌ మోనిటర్‌ (భూకంప లేఖిని)ని మార్స్‌ ఉపరితలంపై అమర్చింది. ఇలా మార్స్‌పై ప్రకంపనాలను రికార్డు చేయడానికి ఉద్దేశించిన ఈ అంగారక ప్రకంపన లేఖిని అమర్చడం ఇదే ప్రప్రథమం. భూమిపై ప్రకంపనాలను రికార్డు చేయడానికి భూకంప లేఖినిని వాడుతారు. మార్స్‌పై అమర్చిన పరికరం కాబట్టి దీనికి అంగారక ప్రకంపన లేఖిని అని నామకరణం చేయవచ్చు. ఇన్‌సైట్‌కు చెందిన రోబోటిక్‌ ఆర్మ్‌ తన డెక్‌లో దాచి వుంచిన సీస్మోమీటర్‌ను తీసి, మార్స్‌ ఉపరితలంపై అమర్చింది. ఇదంతా కొన్ని నిమిషాల్లో గడిచిపోయింది. మార్స్‌పై ప్రకంపనలను ఇది పర్యవేక్షిస్తుంది. ఇక నుంచి మార్స్‌పై ఎలాంటి ప్రకంపనలు సంభవించినా, అవి వెంటనే రికార్డవుతాయి. క్రిస్మస్‌ సందర్భంగా ఇదొక గొప్ప మైలురాయిగా ఇన్‌సైట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ టామ్‌ హాఫ్‌మన్‌ తెలిపారు. మార్స్‌ ఉపరితలంపై ఒక రోబోటిక్‌ ఆర్మ్‌ పనిచేయడం ఇది తొలిసారి. ఈ వ్యవహారం మొత్తాన్ని కాలిఫోర్నియాలోని పసదేనాలో గాల నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలోని ఫ్లయిట్‌ కంట్రోలర్టు పర్యవేక్షించాయి. ఫ్రెంచ్‌ డోమ్‌ ఆకారంలో వున్న ఈ సీస్మోమీటర్‌ ఐదడుగుల ఎత్తు మాత్రమే వుంది. వచ్చే నెలలో ఇన్‌సైట్‌ ఇదే సీస్మోమీటర్‌పై ఒక విండ్‌ కవర్‌ను అమర్చుతుంది. అది ఇంకొక ప్రయోగంగా పేర్కొంటారు. ఇన్‌సైట్‌ ల్యాండర్‌ను నాసా నవంబరు 26వ తేదీన మార్స్‌పై ల్యాండ్‌ చేసిన విషయం తెల్సిందే.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments