మోడీకి స్పష్టమైన
ప్రజల అసంతృప్తి సందేశం
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనేందుకు ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వెలువడ్డాక ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకోవడంతో ఉత్సాహంతో ఉన్న ఆయన ప్రజలు మార్పును కోరుకొంటున్నారని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పా ర్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రధాని మో డీని పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించినప్పటికీ ఆయన ‘దేశం గుండె చప్పుడు’ వినలేదన్నారు. దే శంలోని యువత భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు అడుగుతున్నారని, భవిష్యత్తుపట్ల యువతలో అసంతృప్తి ఉందని రాహుల్ చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రాణించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్పుకు ఇదే తరుణం. మూ డు రాష్ట్రాలను అభివృద్ధి పరుస్తాం అన్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ తరచూ బిజెపి చెప్పడా న్ని ఆయన విమర్శించారు. ‘బిజెపికి కొన్ని సిద్ధాంతాలున్నాయి. మేము వాటితో తలపడతాం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలుస్తాం. అయితే మేము ఎవరినీ వదిలించుకోవాలని చూడం. ‘హమ్ కిసీ కో ముక్త్ నహీ కర్నా చాహ్తే హై’ అన్నారు. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా ఎవరవుతారు?’ అని ప్రశ్నించినప్పుడు ఆయన ‘ఇదేం పెద్ద సమస్య కాదు. సజావుగా నిర్ణయిస్తాం’ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలపట్ల వారికి అసంతృప్తి ఉంది. పెద్ద నోట్ల రద్దు, రైతులు, యువత తదితర అంశాలపై అసంతృప్తి ఉందన్నారు. దేశం ప్రగతి సాధించేందుకు ఓ దార్శనికతను చూపడంలో బిజెపి విఫలమైందన్నారు. తాము గెలిచిన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ‘రుణ మాఫీ అనేది ఓ చర్య మాత్రమే, ఇది రైతుల దుస్థితికి పూర్తి పరిష్కారం మాత్రం కాదు’ అన్నారు. ఏడాది కిందట కాంగ్రెస్ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అప్పగించారు. ఇప్పుడు ఆయన సారథ్యంలో కాంగ్రెస్ బలాన్ని పుంజుకుంటోంది. కాంగ్రెస్ విజయానికి కారణమైన కార్యకర్తలను రాహుల్ గాంధీ ప్రశంసించారు. వారిని సింహాలు( బబ్బర్ షేర్) అని కొనియాడారు.
మార్పుకు ఇదే
RELATED ARTICLES