ప్రజాపక్షం / హైదరాబాద్ : వేసవితో పాటే రానున్న మామిడి పండ్లపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రసం మామిడి పండ్లయిన బంగినపల్లి, కొ ల్లాపూర్ రసాలు, తోతాపురి, నీలం రకం, , నూజివీడు , గున్న మామిడి రసం మామిడి, చిన్న రసం, పెద్ద రసం, హిమాయతి, కొబ్బరి మామిడి, అల్ఫోస్సా రకం, బెనిషన్, హిమ్‌సాగర్ రకాల మామిడి పండ్లు తెలుగు రాష్ట్రా ల్లో విస్తారంగా రైతులు సాగు చేస్తున్నారు. తెలుగు లొగిళ్లలో ఎలాంటి కూరులు చేసుకున్నప్పటికీ మామిడి పచ్చ డి లేనిదే ముద్ద దిగదని ఆహార్య ప్రియులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగానే పచ్చళ్లకు వినియోగించే ‘కారం మామిడి ’ రకాలను తోటల ద్వారా సాగు చేస్తున్నారు. ఈ సారి తమ పొలాల్లో తోట మామిడి పం డ్లకు మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నారు. అదే సమయంలో బంగినపల్లి, కొల్లాపూర్ తదితర మామిడి తోటలపై దళారులు ఇప్పటి నుండే కన్నేశారు. ఉద్యాన రైతులను మచ్చిక చేసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో విందు లు ఏర్పాటు చేసుకుని మామిడి పండ్లను ఈ సారి తమకే విక్రయించాలని కోరుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి తొ లి వారంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ , గద్వాల జిల్లా శివారుల్లోని పలు గ్రామాలకు చెందిన మామిడి తోటల్లో విందులు ఏర్పాటు చేసి మామిడి రైతులను మచ్చిక చేసుకున్నారు. కారు చౌకగా మామిడి పండ్లను కొనుగోలు చేయడానికి ఈ ఎత్తుగడ వేసినప్పటికీ మామిడి రైతులు విధి లేక వారి కే విక్రయాలు చేశారు. ప్రభుత్వ పరంగా ఈ ప్రాంతాల్లో సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించక పోవడం , మామిడి పండ్ల నిలువకు శీతల గిడ్డంగులను నిర్మించక పోవడం, మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో దళారులు ఆడింది ఆటగా మారింది. దీంతో దళారుల బారిన పడి మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రిందటి సంవత్సరంతో పోలి స్తే ఈ సారి మామిడి దిగుబడి కాస్త తక్కువగానే ఉందని మామిడి రైతులు చెబుతున్నారు. చెట్లపై ఉన్న మామిడి కాయలను అక్కడే తెంపి వేసి పట్టణ ప్రాంతాలకు రవా ణా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు దళారులు పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. కాగా ఉద్యాన పంటలను పండించే రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లే దన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల విభజనకు ముందు అధికారులు కొంతలో కొంత అయినా సూచనలు, సలహాలు ఇచ్చే వారని, ఇప్పుడు 33 జిల్లాలుగా విభజన చేసినా అధికారులు మాత్రం తమ గ్రామాల వై పు కన్నెత్తి కూడా చూడడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఉదా.. కొల్లాపూర్ మామిడి పండ్లనే తీసుకుంటే ఈ మామిడికి ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోనే కాకుండా ముం బయి, బెంగళూరుతో పాటు అమెరికాకు కూడా ఎగుమతి చేస్తారు. తోతాపురి, చిన్న, పెద్ద రసాల మామిడి పండ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ సారి మామిడి పండ్ల సీజన్‌లో ఒక్కో జిల్లాలో సగటున 10 వేల ఎకరాల్లో మమిడి తోటలు సాగు చేస్తున్నారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే 16 , 500 ఎకరాలు సాగు అవుతుండగా , కామారెడ్డి కొల్లాపూర్ ప్రాంతాల్లో 7 వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో నీళ్లు అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంత మామిడి రైతులు ఆశాభావంతో ఉన్నారు.
గిట్టుబాటు ధరలపై గంపెడాశలు !
మామిడి పండ్ల రైతులు ఈ సారి గిట్టుబాటు ధరలపై గం పెడాశతో ఉన్నారు. మామిడి సాగు క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కొంత మేర తగ్గడమే దీనికి ప్రధాన కా రణం అంటున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి లేదని, కొన్ని ప్రాంతాల్లో గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే మామిడి సాగు చే సే రైతులు మొదట్లోనే చెట్లకు కాపును చూసి కౌలు రైతులకు ఏడాదికి గుత్తకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరు చెట్ట కు కాసిన కాయల ఆధారంగా దళారులకు విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా గిట్టుబాటు ధరలు లేక పోవడమే తోటల రైతులకు నమ్మకం లేక ముందుగానే విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెబుతున్నారు.
మామిడి ప్రాసెసింగ్ ఏర్పాటు చేయరూ!
ఎన్నికల వేళ ఓట్లు అడిగేందుకు వచ్చే రాజకీయ పార్టీల నేతలు ఆయా ప్రాంతాల్లో మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో మామిడి ప్రాసెసింగ్ యూనిట్లుమాత్రం ఏర్పాటు కావడం లేదు. లక్షల్లో ఖర్చు పెట్టి సాగు చేస్తున్న మామిడి తోటల రైతులు మామిడి నిల్వ, గిట్టుబాటు ధరలు , అలాగే ప్రభుత్వ పరంగా వసతులు లేక నష్టపోతున్నారు. మామిడి రైతుల కష్టాలను గమనంలో ఉంచుకుని మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు, మార్కెట్ కేంద్రాలను వీలైన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకు రావాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలేవీ?
RELATED ARTICLES