HomeNewsBreaking Newsమానేరుకు మణిహారం

మానేరుకు మణిహారం

రివర్‌ ఫ్రంట్‌తో టూరిజం హబ్‌గా కరీంనగర్‌
కేబుల్‌ బ్రిడ్జికి ఔట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌ అవార్డ్‌
స్మార్ట్‌ సిటీతో మారుతున్న నగరం రూపురేఖలు

ప్రజాపక్షం/కరీంనగర్‌ గుజరాత్‌లోని సబర్మతిని మైమరపించేలా కరీంనగర్‌లోని ‘మానేరు తీరం’ ముస్తాబవుతోంది. మానేరు రివర్‌ ఫ్రంట్‌తో కరీం‘నగరం’ టూరిజం హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఇందులో భాగంగా నిర్మిస్తోన్న కేబుల్‌ బ్రిడ్జ్‌ అప్పుడే ప్రశంసలు అందుకుంటున్నది. రానున్న కొద్దికాలంలోనే స్మార్ట్‌ సిటీగా మెరుగులు దిద్దుకోనుంది. నగరానికి ప్రత్యేక వనరుగా ఉన్న లోయర్‌ మానేరు డ్యామ్‌ను, మానేరు నదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.410 కోట్ల నిధులతో ప్రతిష్టాత్మకంగా మానేరు రివర్‌ ఫ్రంట్‌కు అంకురార్పణ చేశారు. మొదటి దశలో 3.75 కిలోమీటర్లు, రెండవ దశలో 6.25 కిలోమీటర్ల పొడవునా మానేరు తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా మ్యూజికల్‌ ఫౌంటేన్‌, లేజర్‌ లైట్‌, ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌, లైటింగ్‌ అరౌండ్‌ వాటర్‌, ఇంటరాక్టివ్‌ గ్లోయింగ్‌ నైట్‌ గార్డెన్‌, వాటర్‌ క్లాక్‌, వాటర్‌ ఫాల్‌ స్వింగ్‌, సిల్వర్‌ ఫౌంటేన్‌, థీమ్‌ పార్కు, వాటర్‌ డాన్స్‌ విత్‌ లైట్‌, వాటర్‌ స్పోర్ట్‌ విత్‌ లైటింగ్‌ ఫౌంటేన్‌లను, అద్భుతమైన పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌, ఇతర స్పోర్ట్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మానేరు నదిపై నిర్మిస్తోన్న కేబుల్‌ బ్రిడ్జ్‌కు ‘ఔట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌ 2021 అవార్డు’ దక్కింది. దీంతో కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రతిష్ట మరింత పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1082 కోట్లతో నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టాయి. మానేరు రివర్‌ ఫ్రంట్‌, స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్స్‌, రోడ్లు, డ్రైనేజీలు, 24 గంటల నీటి సరఫరా, సిసి కెమెరాలు, స్టాటర్‌ హౌజ్‌, వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టారు. మినీ రవీంద్రభారతి, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు, కశ్మీర్‌ గడ్డ, కరీంనగర్‌ వెజిటేబుల్‌ మార్కెట్లను అభివృద్ధి చేస్తున్నారు. మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌, మల్టీపర్పస్‌ స్కూల్‌ ఆవరణలోని పార్కు అభివృద్ధి, వరద నీటి నీటి నిర్వహణ, స్కూళ్లు, టాయిలెట్ల నిర్మాణం, డిజిటల్‌ లైబ్రరీ, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, నీటి, వాయు కాలుష్యం నిర్ధారించే సెన్సార్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు జంక్షన్‌ల అభివృద్ధి, బిసి స్టడీ సర్కిల్‌, బాలసదన్‌, అంగన్‌వాడీ కేంద్రాల పునర్‌ నిర్మాణం, అంబేద్కర్‌ స్టేడియంలో పలు నిర్మాణాలు, తెలంగాణ చౌక్‌ అభివృద్ధి సహాయ పలు పనులు చేపట్టారు. ఏడాదిలోగా వీటిని పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. మరోవైపు ఐటి టవర్‌ ప్రారంభించి స్థానిక యువతకు ఇక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు దొరికేందుకు దోహదమయ్యారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయినా కొన్నేళ్ల కింద వరకు కరీంనగర్‌ సిటీలో అనేక సమస్యలు రాజ్యమేలేవి. 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్త నిర్మాణ పనులు అనేక ఏళ్లుగా కొనసాగి నగర ప్రజలకు చుక్కలు చూపించింది. మిగతా అభివృద్ధి పనులూ అదే తరహాలో అస్తవ్యస్థంగా మారాయి. మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఈ సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించారు. సిఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ ప్రోత్సాహంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments