అతిస్వార్థంతో ప్రకృతి విధ్వంసం
రెండోరోజు జరిగిన నదుల పరిరక్షణ జాతీయ సదస్సులో వక్తలు
ప్రజాపక్షం/హైదరాబాద్ నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో రెండవరోజు ఆదివారం జరిగిన “నదుల పరిరక్షణ” జాతీయ స్థాయి సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ , జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్,హిమాలయ రివర్ కౌన్సిల్ ఛైర్మన్ ఇందిరా తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో నదుల పరిరక్షణ, ప్రజలల అవగాహన, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మానవ నిర్లక్ష్యమే నదులను నాశనం చేస్తోందన్నారు. మనుషుల అతిస్వార్థంతోనే ప్రకృతి నాశనమవుతోందన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో “నదుల పరిరక్షణ ”పై రెండవ రోజు ఆదివారం జరిగిన జాతీయ సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి హాజరై ప్రసంగిస్తూ జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. హైదరాబాద్‌లో మూసీ నది ఆక్రమణలకు గురైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నదులకు తిరిగి ప్రాణం పోస్తున్నారని, ఆయన కృషి వల్లనే చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడే స్ఫూర్తిగా కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు.మూసీ, గంగను నాశనం చేసింది మనుషులేనని, వరదలొస్తే ప్రకృతికి ఆక్రోశం వచ్చిందని చెబుతున్నారు కానీ నది ఆక్రమణ చేశామని మాత్రం చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. మనుషులు జబ్లుకు 50 శాతం కలుషిత నీరు, ఆహారమేనని అన్నారు. కెసిఆర్ పాలనతో ఊళ్లను వదిలి నగరాలకు వలసవెళ్లిన వారు తిరిగి ఊళ్లకే చేరుకుంటున్నారని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. 2014కు ముందు నల్గొండ జిల్లాలో 2 లక్షల మంది ఫ్లోరోసిస్ బారినపడ్డారని, తెలంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆలోచనతో సమస్య తీరిందన్నారు. గతేడాది నుంచి ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
భవిష్యత్ తరాల కోసం నదులను కాపాడుకోవాలి: మంత్రి హరీశ్‌రావు
భవిష్యత్ తరాల కోసం నదులను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు పడినా ఎక్కడా చెరువులు తెగలేదని, 4వేల చెక్ డ్యామ్‌లను రూ. 6 వేల కోట్లతో నిర్మించుకున్నామన్నారు. ఏడాది పొడవునా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చామని, పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం మూడేళ్ల సమయం పట్టిందని, కానీ మూడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని తెలిపారు. న్నారు. దేశంలో కొన్ని ప్రాజెక్టుల పూర్తికి దాదాపు 20 ఏళ్లు పట్టిందని,అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్‌ను మూడున్నరేళ్లలో పూర్తి చేశామని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టామన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని, 2014 తో పోల్చితే 2021 లో రెట్టింపు స్థాయికి చేరిందని హరీశ్‌రావు వివరించారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చెరువులను పునరుద్ధరించుకున్నామన్నారు.
మానవ నిర్లక్ష్యం వల్లే నదులు నాశనం
RELATED ARTICLES