HomeNewsBreaking Newsమానవత్వానికి మచ్చ…

మానవత్వానికి మచ్చ…

మణిపూలో నగ్నంగా ముగ్గురు మహిళల ఊరేగింపు
అత్యాచారం, హత్య, తండ్రి సోదరుడి కాల్చివేత
ప్రధాన నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ :
మణిపూర్‌లో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిలో చిన్న వయసు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ నాగరిక సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాంగ్‌పోక్‌పీజిల్లా బి.ఫాయినోమ్‌ గ్రామంలో మే 4వ తేదీన జరిగిన ఈ సంఘటన వీడియో రూపంలో ట్విట్టర్‌ ద్వారా వైరల్‌ కావడంతో ఈ అమానుష ఘటన చూసి దేశం తలదించుకుంది. రెండు నెలలక్రితం జరిగిన ఈ ఘటనలో సుమారు 30 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. వారిని ఎదిరించిన మహిళ తండ్రిని, సోదరుణ్ణి, అల్లరిమూకలు కాల్చి చంపాయి. ఈ ఘటనతో పొలీసులు ఈ ఘటనాస్థలానికి వెళ్ళకుండా వారిని అల్లరి మూకలు అడడ్డుకున్నాయి. వారిదగ్గర ఉన్న తుపాకులు లాక్కుని బాధితురాలి తండ్రిని, సోదరుణ్ణి కాల్చి చంపారు. మణిపూర్‌లో రెండు నెలలుగా జరుగుతున్న హింసాకాండకు మరింత ఆజ్యం పోసినట్లయింది. జరుగుతున్న జాతుల ఘర్షణలో ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్న కుకీ మహిళలను వెంటాడి వారిని నిర్బంధించారు. దిగంబరంగా గ్రామంలో ఊరేగించారు. ఈ వీడియోలు ట్విట్టర్‌లో రావడంతో దేశం విస్తుపోయింది. ఈ ఘటనపై జూన్‌ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. జూన్‌ 21న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగి రెండు నెలలు గడిచినాగానీ అల్లర్ల నేపథ్యంలో ఈ విషయం బయటకు రాకపోవడం ఆశ్చర్యకరం కాగా
నెల రోజుల క్రితం కేసు నమోదైనాగానీ ఈ విషయం ప్రపంచానిక తెలియరాలేదు. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరికు వీడియో వైరల్‌ కావడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిని గురువారంనాడు ఆదరాబాదరాగా పోలీసులు అరెస్టుచేశారు. మిగిలినవారు పరారీ కాగా ఆ గ్రామం గ్రామాన్ని ఖాళీచేసి అందరూ గ్రామం వదిలి పారిపోయారు. ట్విట్టర్‌లో వీడియో వైరల్‌ కావడంలో మణపూర్‌ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ప్రచార పటాటోపం కోసం నిందితడి ఇంటిని బుల్‌డోజర్‌తో నేలమట్టం చేశారు. ఈ ఘటనలో కుకీ జాతికి చెందిన 50 ఏళ్ళ వయసుగల ఒక స్త్రీ, 40 ఏళ్ళ వయసుగల ఒక మహిళ, 20 ఏళ్ళు వయసుగల ఒక యువతిని అల్లరిమూకలు గ్రామంలో వలువలు తీయించి నగ్నంగా ఊరేగించాయి. కాళ్ళా వేళ్ళాపడి వేడుకున్నాగానీ అల్లరి మూకలు వారిని వదిలిపెట్టలేదు. ఈ వీడియోలో దృశ్యాలు వర్ణింప సాధ్యం కాకుండా ఉన్నాయి. వీడియోలను ఏ విధంగా ట్విట్టర్‌లో వైరల్‌ చేయడానికి అనుమతించారో అర్థంకాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. మహిళలను దిగంబరంగా ఊరేగించిన తరువాత వారిలో యువతిని ఒక పంట పొలంలోకి తీసుకువెళ్ళి గ్యాంగ్‌ రేప్‌ చేశారు. తర్వాత వారు అక్కడ కొన ఊపిరితో తీసుకుని తీసుకుని మరణించారు. పోలీసులు ఇప్పుడు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకుని శాంతి భద్రతల రక్షణకు పూనుకున్నారు. మే 3వ తేదీ నుండీ మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభం కాగా మరునాడే ఈ అమానవీయ ఘటన జరిగింది.
ఇప్పటికైనా చర్చించండి ః సోనియా
మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండ, అమానుష చర్యలపై ఇప్పటికైనా పార్లమెంటులో చర్చించాలని కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకురాలు సోనియాగాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో మొదటిరోజు సోనియాగాంధీ ప్రధానమంత్రితో జరిపిన సంక్షిప్త సంభాషణలో సోనియాగాంధీ మణిపూర్‌లో మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటనను ప్రస్తావించారు. తక్షణం ఈ విషయంపై సభలో చర్చ జరగాలని ఆమె కోరారు. నరేంద్రమోడీ లోక్‌సభలో మొదటిరోజు పలకరింపుల నిమిత్తం ప్రతిపక్ష సభ్యుల బెంచీలవైపు రాగానే సోనిగాంధీ ప్రధానమంత్రితో ఈ విషయం ప్రస్తావించారు. ప్రధానమంత్రి ప్రతి నాయకుడినీ పలుకరించారు. సోనియా, మోడీ పరస్పరం పలకరింపుల తరువాత ఆమె ఈ విషయం ప్రస్తావించి దీనిపై వెంటనే ఇప్పటికైనా చర్చ జరపాలని కోరారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధురి ఈ విషయం వెల్లడించారు.
ముఖ్యమంత్రిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలి
మణిపూర్‌ ముఖ్యమంత్రి బైరెన్‌సింగ్‌ను తక్షణం పదవి నుండి తప్పించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. బైరెన్‌ సింగ్‌ ఇక ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు? ఆయన రాజీనామా ఎప్పుడు? అని ఆయన ప్రశ్నించారు. మణిపూర్‌లో శాంతిభద్రతల యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని అన్నారు. మణిపూర్‌లో మానవత్వం మంట గలిసింది, అక్కడ మానవత్వం చచ్చిపోయిందని ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి వెంటనే పదవి నుండి వైదొలగాలి, “ఇండియా” (ప్రతిపక్ష కూటమి) సమాధానాలు వచ్చేవరకూ నిలదీస్తూనే ఉంటుంది, ఆ రాష్ట్రంలో శాంతి సాధించేదాకావదిలిపెట్టదు అన్నారు. మమతా బెనర్జీ,స్టాలిన్‌ ఆవేదన
మణిపూర్‌లో మహిళల దిగంబర ఊరేగింపు, సామూహిక అత్యాచారం, హత్య ఘటనలు చూసి తమ హృదయం బద్దలైపోయిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో శాంతి భద్రతల యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని వారు విమర్శించారు. వెంటనే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కోరారు. శివసేన ఎంపి ప్రియాంకా చదుర్వే, ఆప్‌ పార్టీ ఎంప సంజయ్‌ సింగ్‌ తదితరులు ఈ ఘటనపై ట్విట్టర్‌లో పోస్టింగులలు పెట్టారు.
నిందితులను ఉరితీయాల్సిందే
మణిపూర్‌ ముఖ్యమంత్రి బైరెన్‌ సింగ్‌
మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన ముఖ్యమంత్రి బైరెన్‌సింగ్‌ కాంగ్‌పోక్‌పీజిల్లా బి.ఫాయినోమ్‌ గ్రామంలో మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటనపై స్పందిస్తూ నిందితులను వదిలిపెట్టేది లేదని అన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాల్సిందేనని అన్నారు. వారికి ఉరిశిక్ష పడేట్టు చూస్తామని అన్నారు. ఈ అమానవీయ ఘటన జరిగి రెండు నెలలు గడచిన తర్వాత కూడా ఈ కేసు బయటకు రాలేదు. పోలీసులు ఘటనాస్థలంలో ఉన్నప్పటికీ కూడాఈ విషయం బాహ్య ప్రపంచం దృష్టికి రాకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో ప్రచారం పొందడంకోసం అరెస్టు చేసిన ప్రధాన నిందితుడుగా చెబుతున్న వ్యక్తి ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments