ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలే కాదు సెలబ్రెటీలు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదికి ఈ విషయాన్నీ ఆయన ట్విట్టర్ ద్వారా శనివారం వెల్లడించారు. గురువారం నుంచి ఒంట్లో నలతగా ఉందని.. పరీక్షలు చేయించుకుంటే కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ అయిందని అఫ్రీది ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్కరు తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలన్నారు. కాగా కరోనా వచ్చిన అంతర్జాతీయ క్రికెటర్లలో ఆఫ్రిది రెండో వ్యక్తి. ఇదివరకే పాకిస్థాన్ ఓపెనర్ తాఫీఖ్ ఉమర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అయన ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం ఉమర్ కరోనా నుండి కోలుకున్నారు.
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదికి కరోనా
RELATED ARTICLES