ప్రజాపక్షం / హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ పదవి పట్ల అధికార పార్టీ శాసనసభ్యులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నిక ల్లో 88 స్థానాల్లో గెలిపొంది టిఆర్‌ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంఎల్‌ఎలుగా గెలిచిన వారిలో సీనియర్లంతా మంత్రి పదవికోసం ప్రయత్నిస్తున్నారే తప్ప, స్పీకర్ పదవిపై ఊసెత్తడంలేదు. మంత్రి పదవి రాకపోయినా పర్వాలేదు కానీ, స్పీకర్ బాధ్యతలు మాత్రం వద్దు అని పలువురు సీనియర్‌లు తమ అనుచరుల వద్ద వ్యా ఖ్యానిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుని ఇప్పటి వరకూ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన వారంతా ఆ తర్వాత వచ్చే ఎన్నిక ల్లో ఓటమి పాలవుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతులుగా పనిచేసిన డి.శ్రీపాదరావు, ప్రతిభాభారతి, సురేష్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్, తెలంగాణలో తొలి స్పీకర్ ఎస్. మధుసూదనాచారితో సహా అందరూ మరుసటి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. గతం లో స్పీకర్‌గా ఉండి ఉమ్మడి ఎపి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి సైతం మరుసటి ఎన్నికల్లో పోటీ చేయకున్నా రాజకీయంగా దాదాపు ఐదేళ్ళు తెరమరుగయ్యారు. దీంతో స్పీకర్ స్థానంలో కూర్చుంటే వచ్చే ఎన్నికల్లో తాము కూడా పరాజయం పాలవుతామోనన్న సెంటిమెంట్ వారిని వెంటాడుతోంది. ఈ భయంతోనే స్పీకర్ పదవి చేపట్టేందుకు ఎంఎల్‌ఎలెవరూ సాహసించటం లేదు. టిఆర్‌ఎస్‌లో పలువురు సీనియర్ల పేర్లు పరిశీలనకు వస్తున్నాయని తెలిసి వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిసింది.
మాకొద్దీ స్పీకర్ పదవి!
RELATED ARTICLES