న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాం పియన్‌షిప్‌లో భారత బాక్సర్ నీతూ గంగాస్ చాంఫియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగంలో నీతూ స్వ ర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైన ల్లో నీతూ గంగాస్ 5 మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్‌పై గెలుపొందింది. గతేడాది స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతూ.. తాజాగా బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఈ జాబితాలో నీతూ సైతం చేరింది. నీతూ గాంగాస్ 3- మాజీ సిల్వర్ మెడిలిస్ట్, కజకిస్తాన్ బాక్సర్ అలువా బాల్కిబెకోవాను ఓడించింది. క్వార్టర్స్‌లో మడోక వాదా (జపాన్)ను చిత్తుచేసింది. దూకుడు మీదున్న 22 ఏళ్ల నీతు బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె పంచ్‌లకు ప్రత్యర్థికి తట్టుకోలేకపోయింది. దీంతో రెండో రౌండ్లో బౌట్‌ను ఆపిన రిఫరీ నీతును విజేతగా ప్రకటించాడు. సెమీఫైనల్లో మాత్రం నీతూ గాంగాస్ విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. సెమీఫైనల్ మినహా మిగతా అన్ని బౌట్‌లలో నీతూ గంగాస్ ఏకపక్ష విజయాలు సాధించింది. క్వార్టర్స్ వరకు తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను రెండో రౌండ్‌లోనే మట్టికరిపించి విజయాలందుకుంది.
మహిళల బాక్సింగ్ ప్రపంచకప్‌లో నీతూగంగాస్‌కు స్వర్ణం
RELATED ARTICLES