170 పరుగులతో రాణించిన అలిస్సా హీలీ
ఫైనల్‌లో 71 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్
క్రైస్ట్‌చర్చి (న్యూజిలాండ్) : అలిస్సా హీలీ సూపర్ సెంచరీతో చెలరేగిపోవడంతో, మహిళల క్రికెట్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించగలిగింది. అనంతరం న్యూజిలాండ్‌ను 285 పరుగులకే ఆలౌట్ చేసింది. కివీస్ 71 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కోగా, ఆస్ట్రేలియా ట్రోఫీని సంపాదించంది. ఆసీస్‌కు ఈ టైటిల్ లభించడం ఇది ఏడోసారి. ఫేవరిట్ ముద్రతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 356 పరుగులు సాధించింది. అలిస్సా హీలీ 170 పరుగులు చేయడం విశేషం. రాచెల్ హేన్స్ 68, బెత్ మూనీ 62 చొప్పున పరుగులు సాధించి, ఆస్ట్రేలియా భారీ స్కోరుకు సహకరించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అన్యా ష్రబ్‌సోల్ కొంత వరకూ మెరుగైన ప్రదర్శనతో, 46 పరుగులకు మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగలిగింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 357 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇన్నింగ్స ప్రారంభించిన ఇంగ్లాండ్ దారుణంగా విఫలమైంది. పూర్తి కోటా ఓవర్లు కూడా ఆడలేక, 43.4 ఓవర్లలో 285 పరుగులకే కుప్పకూలింది. నటాలీ స్కీవల్ 121 బంతుల్లోనే 148 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఒంటరిపోరు కొనసాగించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఫలితంగా ఇంగ్లాండ్‌కు పరాజయం తప్పలేదు. ఫైనల్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన ఆస్ట్రేలియా సెంచరీ హీరోయిన్ అలిస్సా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిది. ఈ టోర్నీ మొత్తంలోనూ ఆమె గొప్పగా రాణించింది. అందువల్లే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా ఆమెకే దక్కింది.
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చాంప్ ఆస్ట్రేలియా
RELATED ARTICLES