రాజ్‌కోట్: తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్, బంగ్లా రెండో టీ20కి ఏర్పాట్లు చేస్తున్నామని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని వెల్లడించింది. మ్యాచ్ నిర్వహించేందుకు వీలుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ‘మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నాం. నవంబర్ 7న ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ మాత్రం సాయంత్రం మొదలవుతుంది’ అని ఆ సంఘం అధికారి తెలిపారు. దిల్లీ టీ20కి వాయు కాలుష్య సమస్య ఎదురవ్వగా రెండో మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. గురువారం రోజు వేకువజామున ‘మహా’ తుపాను గుజరాత్ తీరంలోని డయు, పోర్‌బందర్ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మ్యాచ్ జరిగే రోజు భారీ వర్షాలకు కారణమవుతుంది. ప్రస్తుతం పోర్‌బందర్‌కు 660 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే ముందు రాజ్‌కోట్ సహా గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
‘మహా’ తీరం దాటినా మ్యాచ్ నిర్వహిస్తాం
RELATED ARTICLES