గవర్నర్‌ను కలిసిన ఫడ్నవీస్, శివసేన నేత
‘చెరిసగం’పై కుదరని అవగాహన
ముంబయి : మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బిజెపి పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిజెపి నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన సీనియర్ నేత దివాకర్ రౌత్ సోమవారం వేర్వేరుగా గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిశారు. అయితే ఈ ఇద్దరు నాయకులు గవర్నర్‌ను మ ర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని రాజ్‌భవన్ అధికారులు పేర్కొన్నారు. ఫడ్నవీస్ ఉదయం 11 గంటలకు దక్షిణ ముంబయిలో ఉన్న రాజ్‌భవన్‌కు వెళ్లిన గవర్నర్ కొశ్యారీతో భేటీ అయ్యారు. అదే విధంగా రౌత్ కూడా గత నెలలో 19వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన కొశ్యారీతో స మావేశమైనట్లు రాజ్‌భవ్‌న అధికారులు మీడియా కు వెల్లడించారు. అయితే గవర్నర్‌ను కలిసి దీపావళి శుక్షాకాంక్షలు తెలినట్లు ఫఢ్నవీస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని కూడా ఆయనకు వివరించానన్నారు. శివసేన నేత దివాకర్ రౌత్ కూడా గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకే కలిశానని ప్రకటించారు. మ హారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై రౌత్ గవర్నర్‌తో చర్చించి ఉంటారనే ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేనకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు బిజెపి హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమం త్రి పదవి, ప్రభుత్వ ఏర్పాటులో చెరిసగం వాటా ఉండాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబట్టింది. అయితే, కాషాయ పార్టీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. మరోవైపు శివసేన ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కొందరు బిజెపి నేతలు సూచిస్తున్నారు. ఈ విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. తాజాగా శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో బిజెపిపై ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఎన్నికల ఫలితాల్లో బిజెపి 105 స్థానాలను గెల్చుకుంది. 2014 ఎన్నికల ఫలితాలతో పోల్చితే ఈసారి 17 సీట్లను కోల్పోయింది. అదే విధంగా శివసేన ఈసారి 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే గతం కంటే ఏడు స్థానాలను కోల్పోయింది. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్‌సిపి 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.