ముంబయి : రెండు రోజుల పర్యటన నిమిత్తం పదిమంది సభ్యులతో కూడి న కేంద్ర ప్రతినిధుల బృందం మంగళవారం మహారాష్ట్ర చేరుకుంది. తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఈ బృందం మూడు గ్రూపులుగా విడిపోయి మరత్వాడా, ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని తహశీల్‌లలో పర్యటిస్తుందని రాష్ట్ర సహాయ, పునరావాస విభాగం అధికారి తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి కొంత ఆర్థిక సాయాన్ని ప్రకటించే ముందు సాధారణంగా నిర్వహించే పర్యటనే ఇది అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతినిధుల బృందానికి స్థానిక రెవెన్యూ అధికారులు తయారు చేసిన పంట నష్టం అంచనా వివరాలను, నమోదైన వర్షపాత వివరాలను, పంటల వివరాలను అందించనున్నట్లు ఆయన చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులతో ప్రతినిధుల బృందం నేరుగా మాట్లాడుతోందని ఆ అధికారి తెలిపారు. అదే విధంగా నష్టంపై మంత్రులు, రెవెన్యూ, వ్యవసాయ, సహాయక, పునరుద్ధరణ అధికారులతో చర్చలు జరుపుతుందన్నారు. కాగా, 36 జిల్లాల్లో ఉన్న 151 తాలుకాలకు గానూ 26 తాలుకాల్లో తీవ్ర కరువు పరిస్థితి నెలకొన్నాయని ఇటీవల మహారాష్ట్ర ప్రభ్తువం వెల్లడించింది.
మహారాష్ట్ర కేంద్ర ప్రతినిధుల బృందం పర్యటన
RELATED ARTICLES