సీ ఓటర్-ఏబీపీ సర్వేలో వెల్లడి
కూటమికి 64, టీఆర్ కు 42
బీజేపీ 4, ఇతరులకు 9 సీట్లే
హైదరాబాద్: టీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తు ప్రయోగం విఫలం కానుందని సీ ఓటర్ ఏబీపీ సర్వే చెబుతోంది. ఈ ఎన్నికల్లో మహా కూటమిదే విజయమని సర్వే తేల్చింది. ఈ సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. మహా కూటమికి 64 సీట్లు, టీఆర్ కు 42 సీట్లు పోను బీజేపీ 4, ఇతరులు 9 సీట్లు దక్కించుకోనున్నారని తేల్చేసింది. తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని సీ ఓటర్ సర్వే దాదాపుగా స్పష్టం చేసింది. ఇండియా టుడే – ఆజ్ తక్ సర్వేలో టీఆర్ విజయం సాధిస్తుందని రెండు రోజుల క్రితం వెలువరించిన విషయం విదితమే. ఏబీపీ – సీ ఓటర్ తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలలో సర్వే నిర్వహించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మధ్యప్రదేశ్ లో రెండుపార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ బీజేపీనే విజయం వరించనుంది. ఛత్తీస్ గఢ్ లో ఈసారి కూడా బీజేపీ నే అధికారం కైవసం చేసుకంటుందని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన సర్వే ఫలితాలలో టీఆర్ విజయం సాధిస్తుందని, కూటమి గెలుపు సాధ్యం కాదని తెలిపాయి. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడంతో టీఆర్ పార్టీ బడా నేతలు స్వంతంగా ఊదరగొట్టుకుని విస్తృత ప్రచారం కల్పించుకున్నారు. తెలంగాణలో సెంటర్ ఫర్ ఓటింగ్ ఒపినీయన్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఎలక్షన్స్ రీసెర్చి (సీ ఓటర్) ఏబీపీ నవంబర్ రెండో వారంలో క్షేత్రస్థాయిలో లోతుగా సర్వే నిర్వహించింది. 64 సీట్లు గెలుచుకుంటుందని, స్పష్టమైన మెజారిటీ వస్తుందని సీ ఓటర్ తేల్చేసింది. తెలంగాణలో 13,624 ఓటర్ల నుంచి నమూనా సర్వే వివరాలు సేకరించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలపడం, టీజేఎస్ జతకట్టడంతో మహా కూటమి బలం బాగా పెరిగిందనేది స్పష్టమవుతోంది. పోలింగ్ తేదీ నాటికి కూటమి మరింత బలం పుంజుకోనున్నదనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది.