HomeEntertainmentCinema‘మహర్షి’ పెద్ద హిట్‌ అవుతుంది

‘మహర్షి’ పెద్ద హిట్‌ అవుతుంది

డివైన్‌ విజన్‌ ఇంటర్‌నేషనల్‌ బ్యానర్‌పై డివిజన్‌ ఆఫ్‌ బ్రహ్మకుమారీస్‌ సమర్పిస్తున్నచిత్రం గాడ్‌ ఆఫ్‌ గాడ్స్‌. వెంకటేష్‌గోపాల్‌ దర్శకత్వంలో జగ్‌మోహన్‌ గర్గ్‌, ఐఎంఎస్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజశ్వీమనోజ్ఞ, త్రియుగమంత్రి, రాజసింహ వర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో హిందీలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. శాంతి, ప్రేమ విలువలతో నవ ప్రపంచ పునరుద్ధరణ మహాకార్యం వంటిది ఈ చిత్ర కథాంశం. అద్భుతమైన ఆడియో విజువల్స్‌ ఈ చిత్రం యొక్క మరో ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆడియో, ట్రైలర్‌ను ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…దిల్‌రాజు మాట్లాడుతూ… ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ లాంచ్‌ నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన భారతదేశంలో ఉన్నన్ని మతాలు మరే దేశంలోనూ ఉండవు. అయినా కూడా మనదేశంలో ఎమోషన్స్‌ అనేవి చాలా ఎక్కువ. అవి ఇప్పటికీ ఇంకా అలానే ఉన్నాయి. ఈ సినిమా ఆడియోని ఇలా చేస్తారని తెలిసుంటే నేను ఇంకా బాగా డిజైన్‌ చేసేవాడ్ని. బ్రహ్మకుమారీస్‌వాళ్ళు ఇక ముందు ఇటువంటి సినిమాలు తియ్యదలుచుకుంటే నన్ను పిలిస్తే తప్పకుండా నేను మీ వెంట వుంటాను అని అన్నారు. అంతేకాక ఈ సినిమా విడుదలకు నా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను అని అన్నారు. నా వల్ల ఎవరికీ మంచి జరగకపోయినా పర్వాలేదు కాని చెడు మాత్రం జరగకూడదన్నది నా కన్సెప్ట్‌. అందుకే నా సినిమాల వల్ల వీలైనంతవరకూ మంచి మాత్రమే చూపిస్తాను అని అన్నారు. సాయి వెంకట్‌ మాట్లాడుతూ… ఈ చిత్రం ఆడియోను సక్సెస్‌ఫుల్‌ నిర్మాత అయిన దిల్‌రాజు చేతులమీదగా లాంచ్‌ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం స్పిరిట్యువల్‌ ఆర్గనైజేషన్స్‌ నుంచి వస్తుంది. చెడు నుంచి మంచి రావాలంటే ఏంటి అన్న కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మనోజ్ఞ ఈ పాత్రకి చాలా కరెక్ట్‌గా సూట్‌ అయింది. ఆమె ఒక డాక్టర్‌. కమర్షియల్‌ ,మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ ఇది. ఈ ఆడియో రిలీజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నిస్వార్ధంగా సేవ చేసే బ్రహ్మకుమారీస్‌ సర్వీస్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళ భక్తులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వారిలో ఒక పది మంది ఈ సినిమా గురించి చెప్పినా చాలు మహర్షికంటే ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందని అన్నారు. కుల్‌దీప్‌ దీది మాట్లాడుతూ… ఈ కథని తెరకెక్కించేందుకు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ చాలా కష్టపడ్డారు. చాలా మంచి కథ ఇది. ఈ ఈవెంట్‌ని చేయడానికి సహాయం చేసిన సాయి వెంకట్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తెలుగులో ఈ చిత్రం విడుదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దేశాల్లో మా భక్తులు ఉన్నారు అన్నది కూడా ఈ చిత్రం ద్వారా మాకు బాగా తెలిసింది. ఇక్కడకు విచ్చేసిన జస్టీస్‌ ఈశ్వరయ్య, జడ్జి రమేష్‌గారికి, నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తేజశ్వీ మనోజ్ఞ మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి సినిమానే ఇంత మంచి డివోషన్‌కి సంబంధించి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌, డైరెక్టర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. గాడ్‌ ఆఫ్‌ గాడ్స్‌ అన్నది ప్రత్యేకించి ఒక మతానికి సంబంధించిన చిత్రం కాదు. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది అని అన్నారు. డైరెక్టర్‌ వెంటక్‌ గోపాల్‌ మాట్లాడుతూ… ఈ సినిమా చాలా సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌. ఎవ్వరినీ నొప్పించకుండా చెయ్యాల్సిన చిత్రమిది. భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని అందరూ గ్రహించాల్సిన విషయమిది అని అన్నారు.ప్రొడ్యూసర్‌ ఐ.ఎం.ఎస్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ కథ చాలా మంచిది. ఎంతో కష్టపడి తెరకెక్కించాం. యు.ఎ సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్‌ ఎఫెకట్స్‌తో తీసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని సంగీతం కూడా చాలా బాగా కుదిరింది అని అన్నారు. ఈ చిత్రాన్ని మెక్సికో, ముంబయి, చెన్నై, యు.కె. మరియు యు.ఎస్‌లో చిత్రీకరించడం జరిగింది అని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ముప్పలనేనిశివ, జస్టిస్‌ ఈశ్వరయ్య, జడ్జిరమేష్‌, తోటచిన్ని, జివికెరావ్‌, నిర్మాత ఐఎంఎస్‌రెడ్డి, శివ బికె. తదితరులు పాల్గొన్నారు. తేజస్విని మనోజ్ఞ, త్రియుగ మంత్రి, రాజసింహవర్మ, శివ, నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం లక్ష్మీకాంత్‌ లక్ష్మీనారాయణ, గాయనీ గాయకులుః శ్రేయా ఘోషల్‌, రమ్యబెహరా, మనోజ్‌నెగీ, ప్రవీణచక్రవర్తి, ప్రసన్న, రాణియా డాగెర్‌, లోకేష్‌ వసంత, హేమచంద్ర, కళ్యాణ, డీప్‌దేవ్‌, రామక్రిష్ణ, మొ. తదితరులు గాత్రాన్ని అందించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments