పెంచుతామన్న ఊహకు తెలివి తేటలు అక్కర లేదు
ఎంత పెంచుతామో ఇప్పడే చెప్పలేం
ద్రవ్యోల్బణం అదుపునకు సమన్వయ కార్యాచరణ
రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) మళ్ళీ ప్రజలపై వడ్డీ భారాలు వేయనున్నదా? ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాటలు, వ్యాఖ్యలు ఈ ప్రశ్నలనే ధృవీకరిస్తున్నాయి. మే నెలారంభంలో నే రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు గణనీయంగా పెం చింది. అయితే మరో రెండు వారాల్లో జరిగే రిజర్వు బ్యాంకు సమావేశంలో ఈ సారి భారీగా వడ్డీ వడ్డనలు చేయనున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే కోట్లాది మందిపై రుణభారాలు విపరీతగా పెరుగుతాయి. ఇప్పటికే ఫిక్సెడ్, ఫ్లోటింగ్ వడ్డీల ప్రాతిపదికపై బ్యాంకు వడ్డీలు చెల్లిస్తున్నవారంతా ఫ్లోటింగ్ వడ్డీ అంచనా ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తమ జేబులకు చిల్లుపెట్టుకోవాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం, విపరీతమైన పె ట్రోలు, డీజిలు ధరల భారం, కూరగాయలు సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరల భారంతో కుంగిపోతూ నోటికీ చేతికీ అందక అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగే వడ్డీ భారాలతో బ్యాంకు కిస్తీలు చెల్లించలేక ఇక మరిన్ని తంటాలు పడవలసి వస్తుంది. ఈ పరిస్థితులమధ్య ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో మరోసారి వడ్డీరేట్లు పెంచుతామని రిజ ర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సుతారంగా తేల్చి చెప్పారు. అయితే ఈ వడ్డీరేట్లు భారం ఏ మేరకు పెరుగగుతాయో ఆయన చెప్పలేదు. కానీ చాలా తెలివిగా, “ఇలా మేం వడ్డీరేట్లు పెంచుతామని ఎవరైనా ఊహించగలరు! ఈ విషయాన్ని అంచనా వేయడానికి, అలా ఊహించడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు, సాధారణం గా ఆలోచిస్తే ఈ విషయం ఎవ్వరైనా చెప్పగలరు!!’ అని భవిష్యత్ భారాల గురించి చెప్పేసి తప్పించుకున్నారు. జూన్ 6 వ దీ నుండి 8 వ తేదీ వరకూ రిజర్వుబ్యాంకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం జరుగుతుందని, అయితే ఈ సమావేశంలో వడ్డీరేట్లను మరోసారి ఎంత మేరకు పెంచుతామన్న విషయాన్ని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని కూడా ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం మరోసారి గట్టి చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఉందని, సమన్వయ కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిర్ణీత ప్రకారం రిజర్వు బ్యాంకు ఎంపిసి వచ్చేనెల 6వ తేదీ నుండి సమావేశం కావాల్స ఉండగా, అనివార్యమైన ప్రపంచ సంక్షోభ పరిస్థితులు, ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరిగిపోవడంతో ఎంపిసి ఆకస్మికంగా మే నెలారంభంలో సమావేశమై గడచిన 11 విడతలుగా పెంచకుండా కొనసాగిస్తున్న వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్లకు అంటే 4.40 శాతానికి పెంచేసింది. రిజర్వు బ్యాంకు మరోసారి కూడా వడ్డీరేట్లు పెంచుతుందని ఊహించడానికి, అంచనా వేయడానికి ఎవరికీ పెద్దగా తెలివితేటలు అవసరం లేదు, బుర్రపెట్టి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు, సాధారణంగా ఆలోచిస్తేనే అర్థం అవుతుంది, పరిస్థితులు అలాంటివి అని సిఎన్‌బిసి 18 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్ చెప్పారు.మరో ‘రెండు వారాల్లో జరిగే సమావేశఃలో వడ్డీరేట్లను ఎంతో కొంత మేరకు పెంచుతాం, అయితే ఎంత అనేదీ మాత్రం ఇప్పుడే కచ్చితంగా ఎలా చెప్పగలం?’ అని ఆయన యాంకర్‌ను ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను గడచిన 11 సమావేశాలలో అస్సలు పెంచకుండా అలాగే కొనసాగించి రికార్డు సృష్టించి తర్వాత దాన్ని పెంచింది. ఏప్రిల్ నెలలో రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణం గురించి ఒక పెద్ద హెచ్చరిక చేసింది. రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరుగుతుందని పేర్కొంది. అప్పుడే అందరూ వడ్డీరేట్లు ఈ సారి భారీగా పెంచుతారని ఊహించారు. తొలుత అంచనావేసిన విధంగా ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతంగా కొనసాగించడం కష్టం అయిపోతుందని, ఇది 5.7 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అయితే దానికంటే కూడా 18 నెలల హెచ్చుస్థాయికి ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. ద్రవ్యోల్బణం అన్యూహమైన స్థాయికి పెరగకుండా ఉండేందుకకు గడచిన రెండు మూడు నెలల్లో రిజర్వు బ్యాంకు శాయశక్తులా కృషి చేసి అనేక చర్యలు తీసుకుందని దాస్ అన్నారు. ప్రపంచదేశాల్లో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి అంచనాలను కూడా 7.8 శాతం నుండి 7.2 శాతానికి రిజర్వు బ్యాంకు తగ్గించుకుంది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం గడచిన కొద్ది నెలలుగా దేశ ఆర్థిక వ్యవస్థ భరించలేని స్థాయిలో పెరుగుతోంది. అయితే ద్రవ్యోల్బణాన్ని రెండు నుండి ఆరూ శాతం లోపు ఉంచడం ప్రబుత్వ కర్తవ్యం. అంతకు మించితే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ప్రభుత్వానికి అసాధ్యం అవుతుంది. అయితే తాజా గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం గతనెలలో నమోదైన 6.65 శాతం నుండి 7.79 శాతానికి పెరిగింది. జపాన్ మినహా బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఈ ద్రవ్యోల్బణం రెండూ శాతం మించి పెరగకూడదని లక్ష్యం పెట్టుకున్నాయి. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ద్రవ్యోల్బణం 7 శాతం పైగానే ఉందని శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు.
మళ్లీ ‘వడ్డీ’ భారం!
RELATED ARTICLES