HomeOpinionEditorialమళ్లీ రామాలయ భజన

మళ్లీ రామాలయ భజన

అయోధ్యలో వివాదాస్పద ప్రదేశంలో రామాలయ నిర్మాణానికై నరేంద్రమోడీ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆర్.ఎస్.ఎస్. అధిపతి మోహన్ భాగవత్ కోరారు. నాగపూర్ కేంద్ర కార్యాలయంలో సాంప్రదాయక విజయదశమి ఉత్సవంలో ప్రసంగం ప్రాధాన్యతగలది. అది సహజంగా వచ్చే సంవత్సరానికి ఎజండా నిర్దేశిస్తుంది. కోర్టు అనుకూల తీర్పు లేదా పార్లమెంటు చట్టం ద్వారా లేదా ఇతరత్రా ఈ ఏడాది రామాలయ నిర్మాణం చేబడతామనే ప్రకటనలు సంబంధిత వ్యక్తులనుంచి కొంతకాలంగా వినిపిస్తున్నవి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వారిలో ప్రముఖులు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందున్న రామజన్మభూమిబాబ్రీమసీదు స్థల వివాదంపై త్వరగా తీర్పు వెలువరించాలని ఒత్తిడిచేయటం వారి ఉద్దేశ్యం కావచ్చు. అయితే భగవత్ తాజా ప్రకటనతో న్యాయవ్యవస్థపై ఈ శక్తులకు విశ్వాసం లేదని, బిజెపికి లోక్ మెజారిటీ ఉన్న ప్రస్తుత తరుణమే చట్టంద్వారా వివాదస్థలాన్ని రామజన్మభూమి న్యాస్ అప్పగించటానికి సరైన అవకాశమని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీమసీదును కూల్చివేసిన నాటినుంచి దేశంలో నెలకొన్న అశాంతిని తొలగించి సామరస్యం నెలకొల్పేం దుకు రామాలయ నిర్మాణమే మార్గమని భాగవత్ ఉవాచ. వివాద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి కేటాయిస్తూ అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అలహాబాద్ హైకోర్టు ఒక భాగాన్ని హిందూపక్షానికి, ఒక భాగాన్ని ముస్లిం పక్షానికి,మూడో భాగాన్ని భగవాన్ రాముడికి కేటాయించటం గుర్తు చేసుకోదగింది.
అయితే నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పని చేస్తుండగా, ఆలయ నిర్మాణం ఇప్పుడే ఎందుకింత అత్యవసరాన్ని సంతరించు కుందనేది ప్రశ్న. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ఏమి మేలు చేశామో చెప్పి మెప్పించలేమని మోడీప్రభుత్వం భయసందేహాల్లో ఉంది. 31శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రతిపక్ష ఐక్యత అవకాశాలను బేరీజు వేసుకుంటోంది. దానికి అత్యంత బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన నష్టాలు సంభవించే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అందువల్ల రామాలయం పేరుతో మత మనోభావాలను మళ్లీ ప్రకోపింపచేయటమే ఉత్తమ మార్గంగా అది భావిస్తున్నది. ప్రభుత్వంలోని బిజెపి ఈ విషయమై నేరుగా మాట్లాడటం ఇబ్బందికరం కాబట్టి దాని గురుపీఠం ఆర్.ఎస్.ఎస్ ఆ బాణీ అందుకుంది. విశ్వ హిందూ పరిషత్ తదితర పరివారం అంతకుముందునుంచే ఈ ప్రచారంలో మునిగిఉన్నాయి. విహెచ్ ఇటీవల నిర్వహించిన మఠాధిపతుల సమావేశం రామాలయ నిర్మాణం కొరకు పార్లమెంటు ద్వారా శాసనం తేవాలని కోరింది. అనేకమంది భావిస్తున్నట్లు ఆర్ మతోన్మాద సంస్థ కాదని, సాధుజంతువు అని నమ్మించటానికై గతనెలలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ మూడు రోజులపాటు తటస్థులకు బ్రెయిన్ వాషింగ్ లెక్చర్ భాగవత్, ఆ సమావేశాల ముగింపులో రామాలయ నిర్మాణ ఆవశ్యకతను వక్కాణించారు. దాని కొనసాగింపే నాగపూర్ ప్రసంగం. తమ రాజకీయ విభాగమైన బిజెపికి ఎన్నికల్లో సానుకూలత సాధించేందుకు ఆర్ మతమనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉంది. శబరిమల ఆలయ దర్శనానికి వయోవివక్ష లేకుండా మహిళలందర్నీ అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేరళవ్యాప్తంగా మత విశ్వాసం పేరుతో ఆర్ బిజెపిలు ఆందోళనలు లేవదీయటం ఈ ఎజండాలో భాగమే. భారతదేశ చరిత్రనుంచి మొగలాయీ చక్రవర్తుల పాలనను చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా అక్బర్ పాలనకాలంలో 1575లో స్థిరపడిన ‘అలహాబాద్’ పట్టణ పేరును వేదకాలంనాటి ప్రస్తావన ‘ప్రయాగ్ రాజ్’గా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మొగల్ సరాయ్ రైల్వేస్టేషన్ పేరును అంతకుముందే మార్చివేశారు. హిందూత్వ ఎజండాను ఒక పధకం ప్రకారం దేశంపై విధిస్తూ రాజ్యాంగ లౌకిక విలువలను తుంగలోతొక్కే ప్రయత్నం జరుగుతోంది.
2019 మేజూన్ మాసాల్లో లోక్ ఎన్నికలలోపు పార్లమెంటు శీతాకాల సమావేశం ఒక్కటే మిగిలి ఉంది. ఈ లోపు సుప్రీంకోర్టు తీర్పు వస్తుందా లేక పార్లమెంటు చట్టానికి మోడీ ప్రభుత్వం సాహసిస్తుందా లేక ఈ రెండూ జరగ్గపోతే బలాన్ని ఉపయోగించి నిర్మాణ ప్రయత్నాలు చేసి సంఘ్ దేశంలో మతోద్రిక్తతలు సృష్టిస్తుందా వేచిచూడదగిన అంశాలు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments