ఉధృతమైన ఆర్‌టిసి కార్మికుల ఆందోళన
కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
పోలీస్ దిగ్బంధనంలో బస్‌డిపోలు
ప్రజాపక్షం/ ఖమ్మం ; సమ్మె విరమణ తర్వాత ఆర్‌టిసి కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. సమ్మె విరమించి విధు ల్లో చేరతామని కార్మిక సంఘాలు ప్రకటించినా ప్రభుత్వం తత్ విరుద్ధంగా స్పందించడంతో రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిం ది. బేషరతుగా విధుల్లో చేరుతామని ప్రకటించినా ససేమిరా అనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన కార్మిక సంఘాలను ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడంతో అక్టోబరు 5 నుంచి సమ్మెకు దిగారు. 52 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సమ్మె కాలంలో సమ్మెను నివారించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా కార్మికులను బెదిరించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం ఆర్‌టిసి పరిరక్షణ ప్రధాన డిమాండ్‌గా సాగిన సమ్మె ఆర్‌టిసి చరిత్రలో ఏనాడూ జరగని రీతిలో సాగింది. 99 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడమే కాదు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చెప్పినా సంస్థ పరిరక్షణే ధ్యేయంగా సమ్మెను కొనసాగించారు. ముఖ్యమంత్రి పిలుపులకు కార్మికు లు స్పందించ లేదు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ 52వ రోజున సమ్మెను విరమించారు. మంగళవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లు లిఖిత పూర్వకం గా తెలియజేసి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం తెల్లవారు జాము నుంచే బస్‌డిపోలు, బస్టాండ్లు, పోలీస్ దిగ్బంధంలోకి వెళ్లా యి. డిపోల వద్దకు వచ్చిన కార్మికులను వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేశా రు. ఒక సమయంలో ఆర్‌టిసి కార్మికులు ఎక్కడ కనపడితే అక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిచ్చింది. సత్తుపల్లిలో పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో మహిళా కండక్టర్‌తో సహా పలువురు కార్మికులు గాయపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యాలయ భవనంలో కార్మికులు, విపక్ష నాయకులు ఉండగా గేట్లకు తాళాలు వేసి బంధించేందుకు ప్రయత్నించా రు. భవనం పైకి వెళ్లిన ఆందోళనకారులు కిందకు దూకేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఇదే వైఖరి అవలంభిస్తే సమ్మె మరింత ఉధృతమవుతుంది. ఒకరిద్దరి సమస్య కాదు50వేల కార్మిక కుటుంబాలకు చెందిన సమస్య ప్రభుత్వం సానుకూల వైఖరి తీసుకుని సమన్వయంతో వ్యవహరించి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.