HomeNewsBreaking Newsమళ్లీ మాస్కులు..

మళ్లీ మాస్కులు..

షాపుల్లో పెరిగిన గిరాకీ
అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కరోనా అలజడి మళ్లీ మొదలుకావడంతో ‘మాస్కుల’కు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో మార్కెట్‌లో మాస్కుల కొనుగోలు పెరిగింది. గత కొంత కాలంగా మాస్కుల వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోని వర్గాలు ప్రస్తుతం మాస్కులను అందుబాటులో పెడుతున్నారు. గత రెండు,మూడు రోజులుగా మాస్కులను అడుగుతున్నారని వ్యాపారస్తు లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధు లు, అధికార వర్గాలను కలిసేందుకు వచ్చే సందర్శకులను తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు. జిహెచ్‌ఎంసిలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులు మా స్కులను ధరించారు. కొన్ని ప్రైవేటు కార్యాలయా ల్లో కూడా మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేశా రు. పలు దేశాల్లో ‘బిఎఫ్‌-7 వేరియంట్‌’ నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆక్సిజన్‌, కొవిడ్‌ నిబంధనల అంశంపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. మరో వైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయల్లో ర్యాండమ్‌గా కరోనా పరీక్షలను ప్రారంభించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్‌ నిబంధనలను అమలులోనికి వచ్చాయి. ప్రయాణికులకు థర్మల్‌, స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రా ల్లో కరోనా ఉధృతిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఫోర్త్‌వేవ్‌పై ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ఫోర్త్‌ వేవ్‌, ప్రజలపై వాటి ప్రభావం, తదితర అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఫోర్త్‌ వేవ్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎవరి పనులను వారు చేసుకోవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరణాల రేటు ఉండదని, ఆరోగ్యంపైన పెద్దగా ప్రభావం చూపబోదని వైద్య ఆరోగ్యశాఖ సూచించింద.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments