రూ.11లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు విజ్ఞప్తి చేసిన సింగారం ప్రజలు
ప్రజాపక్షం/కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సింగారంలో చేపట్టిన మల్లన్నసాగర్ ప్రా జెక్టు నిర్మాణ పనులను ఆ గ్రామ ప్రజలు గురువారం అడ్డుకున్నా రు. మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోతున్న వారికి రూ.11 లక్షల నష్టపరిహారం చెల్లించే వరకు పను లు చేపట్టనివ్వబోమని స్పష్టం చే శారు. ఈ విషయమై సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు వినతిపత్రం అందజేసి తమకు సహా యం చేయాలని కోరారు. ప్రభుత్వంపై నమ్మకంతో మల్లన్నసాగర్ నిర్మాణానికి తామంతా భూములను ఇచ్చేందుకు ముందుకు వ చ్చామన్నారు. దీంతో తమకు ఎకరాకు రూ.6లక్షల నష్టపరిహారం గా ప్రభుత్వం చెల్లించిందన్నారు. అయితే ఇదే ప్రాజెక్టులో భూము లు కోల్పోతున్న తొగుట మండల వేములఘాట్ రైతులకు ఎకరాకు రూ.11 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఒకే ప్రాజెక్టు ప రిధిలో భూములు కోల్పోతున్న వా రికి వేర్వేరుగా నష్టపరిహారం చె ల్లించడంతో తమ గ్రామానికి చెం దిన రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. అదే వేములఘాట్ ప్రజలు పోరాటం చేస్తే ఎక్కువగా చెల్లిస్తుందన్నారు. వేములఘాట్ మాదిరిగానే తమ గ్రామానికి నష్టపరిహారం చెల్లించాలన్నా రు. అప్పటి వరకు పనులు జరగకుండా అడ్డుకుంటామన్నారు. ఈ సందర్భంగా పనులు నిర్వహించడానికి వచ్చిన కొండపాక తహసీల్దార్ ప్రభు, కాంట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నా రు. అనంతరం సిద్దిపేటలోని కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకు ని తమకు నష్టపరిహారం పెంచేలా చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.