రాష్ట్రంలో మరో నలుగురు మరణం
భారీగా కరోనా పరీక్షలు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో తొలిసారిగా రాష్ట్రంలో భారీగా కరోనా పరీక్షలు నిర్వహించింది. కొత్తగా మంగళవారం మరో 213 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీం తో మొత్తం కరోనా మరణాల సంఖ్య 191కి చేరింది. మంగళవారం నమోదైన 213 కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 165 పాజిటివ్‌లు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ కాకుం డా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లో కొత్తగా 3 కేసులు నమోదు అయ్యాయి. అయితే మెదక్‌జిల్లాలో అనూహ్యంగా ఒక్క రోజులో 13 కేసులు నమోదయ్యాయి. అలాగే సంగారెడి, నిజామాబాద్ జిల్లాల్లో రెండేసి కేసులు నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జనగామ, కామారెడ్డి, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యా యి. వలసలు, ప్రవాసులకు సంబంధించి మంగళవారం ఎలాంటి కేసులు నమోదు కాలే దు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5406కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 2188 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 3027 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారంనాడొక్కరోజే 261 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, మంగళవారం భారీసంఖ్యలో 44,431 శాంపిల్స్‌ను పరీక్షించారు. వాటిలో 39,025 శాంపిల్స్ నెగిటివ్‌గా తేలాయి.
మరో 213 కేసులు
RELATED ARTICLES