రాష్ట్రంలో 62,703కు చేరిన కరోనా బాధితులు
తాజాగా 14 మంది మృతి
మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరిక
మొత్తగా 45,388 మంది బాధితులు డిశ్చార్జ్
ప్రజాపక్షం/హైదరాబాద్ కరోనా వైరస్‌తో ఒకే రోజు 14 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1984 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు ఆ సంఖ్య 62,703కు చేరుకుంది. ఒక్కరోజే 21,380 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇంకా 1216 మంది రిపోర్ట్ రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 4,37,582కి చేరింది. కరోనా బారి నుంచి గురువారం 816 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 16,796 మంది, హోమ్ ఐసోలేషన్‌లో 10,632 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం 8 గంటల వరకు కరోనా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 586 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా మేడ్చల్ -మాల్కజిగిరి జిల్లాలో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక్కడ 207 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 205,వరంగల్ అర్బన్‌లో 123, కరీంనగర్‌లో 116 పాజిటివ్ కేసులు కొత్తగా వెలుగు చూశాయి. అయితే ఏకంగా సంగారెడ్డిలో 108 కొత్త కేసులు వచ్చాయి. వారం రోజుల్లో కరోనాతో 46.13 శాతం మరణించగా, ఇతర వ్యాధులతో 53.87 శాతం మంది మృత్యువాతపడ్డారు. టెలిమెడిసిన్, ఏదైనా సమస్యలు ఉంటే 104 నంబర్‌కు, ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 9154170960 నంబర్‌కు ఫోన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు
జిల్లాల వారీగా తాజాగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. ఆదిలాబాద్-లో 16, భద్రాచలం -కొత్తగూడెంలో -29, జిహెచ్‌ఎంసి-లో 586, జగిత్యాల-లో 7, జనగాం-లో 21, జయశంకర్ భూపాల్‌పల్లి-లో 04. జోగులాంబ గద్వాల్-లో 32, కామారెడ్డి-లో 46, కరీంనగర్-లో 116, ఖమ్మం-లో 41, కొమురంబీమ్ ఆసిఫాబాద్-లో 2, మహబూబ్‌నగర్‌లో- 61, మహబూబాబాద్‌లో- 37, మంచిర్యాలలో -35, మెదక్-లో 45, మేడ్చల్- మల్కాజిగిరిలో- 207, ములుగులో- 27, నాగర్‌కర్నూల్-లో 30, నల్లగొండ-లో 36, నారాయణపేట్-లో 4, నిర్మల్-లో 9, నిజా మాబాద్‌లో -19, పెద్దపల్లి-లో 26, రాజన్న సిరిసిల్లలో 23, రంగారెడ్డిలో -205, సంగారెడ్డిలో -108, సిద్దిపేట-లో 20, సూర్యాపేటలో -6, వికారాబాద్-లో 5, వనపర్తి-లో 18, వరంగల్ రూరల్-లో 30, వరంగల్ అర్బన్‌లో – 123, యాదాద్రి- భువనగిరిలో -12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
మరో 1,986 కేసులు
RELATED ARTICLES