663 మంది చికిత్స అందిస్తున్నాం
అందులో ఏడుగురు వెంటిలేటర్‌పై..
గాంధీ ఆస్పత్రికి కొవిడ్ ఆస్పత్రిగా నామకరణం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 983కి చేరినట్టు తెలిపారు. కరోనా నుంచి కోలుకొని 291 మంది బాధితులు డిశ్చార్జి కాగా.. ఆస్పత్రిలో 663 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని మంత్రి తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి కొవిడ్ ఆస్పత్రిగా నామకరణం చేసినట్టు ఈటల వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయి. వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి కేసులు ఎక్కువగా వచ్చాయి. గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45మందికి కరోనా సోకగా.. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి; జిహెచ్ఎంసి పరిధిలో 44 కుటుంబాల నుంచి 260 మందికి కరోనా మహమ్మారి వ్యాపించిందని వివరించారు. రాష్ట్రంలో కరోనా రోగులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. రోగులకు అందించే ఆహారంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తమకు సౌకర్యాలు లేవని రోగులెవరూ చెప్పలేదు. గాంధీ నుంచి డిశ్చార్జి అయినవారెవరూ అసంతృప్తిగా లేరన్నారు. కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బందిని తమ ఇళ్ల వద్దకు రానివ్వడంలేదని, వైద్యులపై దాడులు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని ఈటల రాజేందర్ అన్నారు. 10 లక్షల పిపిఇ కిట్లు, 10లక్షల ఎన్ 95 మాస్క్‌లకు ఆర్డర్ ఇచ్చాం. రాష్ట్రంలో వైద్యులకు ఎక్కడా కరోనా సోకలేదు అని వెల్లడించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం 500లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
మరో 13 కరోనా పాజిటివ్ కేసులు
RELATED ARTICLES