ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయాస్ మరో శతకంతో మెరిసాడు. దీంతో ముంబై ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం మధ్య ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో రికార్డు శతకంతో మెరిసిన శ్రేయస్ అయ్యార్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. మధ్య ప్రదేశ్ నిర్ధేశించిన 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వి షా (0), కెప్టెన్ అజింక్యా రహానే (1) పరుగులకే ఔటవడంతో ముంబై 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులో వచ్చిన శ్రేయస్ అయ్యర్, సుర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. సుర్యకుమార్ ఆచితూచి ఆడుతుంటే.. అయ్యర్ మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఆకాశమే హద్దుగా ఆడుతూ బండరీల వరద పారించాడు. ఇతని ధాటికి ప్రత్యర్థి బౌలర్లు విలవిలలాడారు. చివరికి వీరిద్దరూ మరో వికెట్ పడకుండానే ముంబైకు విజయతీరానికి చేర్చారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 55 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఇతనికి అండరగా నిలిచిన సుర్యకుమార్ 36 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి అజేయంగా ఉండడంతో ముంబై 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. వీరు మూడో వికెట్‌కు అజేయంగా 138 పరుగులు జోడించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్‌పై ముంబై బౌలర్లు విరుచుకపడంతో ఈ జట్టు 19.3 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. మధ్య ప్రదేశ్ జట్టులో కెప్టెన్ రజత్ పండిత్ (47; 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), పార్త్ సహాని (28), వెంకటేశ్ అయ్యర్ (29) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేయడంతో మధ్యప్రదేశ్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 4 వికెట్లు పడగొట్టగా.. షమ్స్ ములాని, ధవాల్ కుల్‌కరి, శార్ధుల్ ఠాకుర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
మరో శతకంతో మెరిసిన శ్రేయాస్
RELATED ARTICLES