హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం దానిని అనుకుని ఉన్న దక్షిణ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది నైఋతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. ఉత్తర-దక్షిన ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.