ఇంకోసారి కుప్పకూలిన మార్కెట్లు
25 నుంచి దేశీయ విమానాలు బంద్
ముంబయి: స్టాక్ మార్కె ట్లు మరోసారి ఘోరంగా పతనమయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారంనాడు స్టాక్ మార్కె ట్లు మరో బ్లాక్ మండేను చూడాల్సి వచ్చింది. గతం లో ఎన్నడూ లేని విధంగా ట్రేడింగ్‌లో అత్యధిక పా యింట్ల నష్టాన్ని చవిచూసింది. బిఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 3,934 పాయింట్ల కోల్పోయి, 25,981కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1,135 పాయింట్ల పతనంతో 7,610 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక రోజులో అటు పర్సంటేజీల పరంగా, ఇటు అంకెల పరంగా అతి పెద్ద పతనం ఇదే. దేశంలోని 7 రాష్ట్రాలు పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించడంతో మార్కెట్లు కూడా భారీగా పతనం అయ్యాయి. దేశంలో కొవిడ్ రెండో దశకు చేరడం.. ఆదివారం ఒక్క రోజే ముగ్గురు చనిపోవడంతో ఇక సమస్య తీవ్రమవుతోందనే సంకేతాలు మదుపరులను భయపెట్టాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే మార్కెట్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే 2,991 పాయింట్లు పతనమై 26,924 పాయింట్లకు, నిఫ్టీ 842 పాయింట్లు పతనమై 7,903కు చేరాయి. సెన్సెక్స్ 10శాతం పతనం కావడంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత మార్కెట్లు మొదలైనా ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో మార్కెట్లు ఈ ఘోరపతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం తీవ్రంగా వుంది. జపాన్ మార్కెట్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో ఆ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. దక్షిణ కొరియా మార్కెట్లది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో డొజోన్స్ ఫ్యూచర్స్ పతనమైంది. ఆ ప్రభావం దేశీయమార్కెట్లపై పడింది. అమెరికాకు ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఆమోదంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొనడంతో అక్కడి ఫ్యూచర్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అక్కడ వైద్యసేవలకు నిధులు అవసరమైన సమయంలో జాప్యం చేయకుండా మంజూరు చేయాలనే డిమాండ్లు నెలకొన్నాయి. కీలకమైన ఓట్లను ఇది ఇంకా సాధించలేదనే ప్రచారంతో అక్కడ ఆందోళన నెలకొంది. కాగా, డాలర్‌తో పోల్చుకొంటూ రూపాయి విలువ పతనమైంది. ఒక్క డాలర్‌కు రూ.76.09 వద్దకు చేరుకోవడంతో ఎఫ్‌ఐఐల విక్రయాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎఫ్‌పీఐలు కూడా రూ.50వేల కోట్ల మేరకు స్టాక్స్‌విక్రయించారు.
మరో బ్లాక్ మండే!
RELATED ARTICLES