కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం
గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఫలితాలు కనిపిస్తాయ్ : మంత్రి హరీశ్‌రావు
ప్రజాపక్షం/ సిద్దిపేట ప్రతినిధి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందు కు కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని, కాళేశ్వరం కన్నా ముందు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని, మరో ఐదేళ్లయినా పూర్తి చేయలేరని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు ను నిర్మిస్తున్న ఇంజనీర్‌ను కలిసి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే తెలియదని సమాధానం ఇచ్నిట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందించటంతో రాష్ట్రం సస్యశ్యామలమై కోట్లాది రూపాయల విలువగల పంటలు పండుతున్నాయన్నారు. సిద్దిపట జిల్లా చిన్నకోడూరు మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన వర్గం ప్రమాణ స్వీకా రం ఆదివారం జరగగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా నూతన పాలక మండలి చూసుకోవాలన్నా రు. వస్తున్నది మార్కెట్ కాలమని ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రా మంలో నిండు కుండలా బావుల్లో చెరువుల్లో నీరు నిండి ఉన్నదని, గతంలో మండలంలో 5 వేల ఎకరాల్లో పంటలు పండగా, ఇప్పుడు ఒక్క చిన్నకోడూరు మండలంలోనే 20 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. కాళేశ్వరం ద్వార ఒక్క ఎకరం కూడా పండలేదని కొంత మంది మాట్లాడుతున్నారని, ఢిల్లీలో, గాంధీభవన్‌లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని, గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. గ్రామంలో నాయకులు చర్చ పెట్టి ఇతర పార్టీ నాయకులు మాట్లాడకుండా చెంప చెల్లు మనిపించాలన్నారు. బిజెపి నాయకులు తెలంగాణ రైతులను నూకలు తినుమని అవమాన పర్చారన్నారు. కానీ, సిఎం కెసిఆర్ ప్రతి గింజను కొనుగోలు చేశారని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందని, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల బోరు బావులకు కరెంట్ బిల్లులు కట్టి రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందచేస్తున్నట్లు తెలిపారు. బోరు బావి వద్ద మీటరు పెట్టాలని కేంద్రం కొర్రీలు పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చే రూ.30 వేల కోట్లు నిధులు నిలిపివేసిందన్నారు. తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, ఆ డబ్బులతో మన ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలో భూములు కొంటున్నారన్నారు. అంతకు ముందు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంతో మంత్రి హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు.
బిఆర్‌ఎస్ పార్టీకి సిద్దిపేట నుండి 12 లక్షల విరాళం
తెలంగాణ సాధించిన నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిని దేశ వ్యాప్తంగా విస్తరించాలని సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీని స్థాపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా విరాళలు ఇచ్చేందుకు ముందుకువస్నుట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గం నుండి వివిధ కుల సంఘాల ప్రజలు రూ. 12.28 లక్షలు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. చిన్నారులు సైతం బిఆర్‌ఎస్ పార్టీకి తమ కిడ్టి బ్యాంకు నుంచి 2 వేల విరాళం ఇచ్చారు. చిన్నారుల ఉడుత భక్తికి మంత్రి హరీస్‌రావు మంత్ర ముగ్దులయ్యారు.
మరో ఐదేళ్లయినా… పోలవరం పూర్తికాదు!
RELATED ARTICLES