HomeNewsBreaking Newsమరో ఉద్యోగ నోటిఫికేషన్‌

మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1520 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు : ఆగస్టు 25 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1520 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుండి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అర్హత : అభ్యర్థులు తెలంగాణ రాష్ర్ట నర్సెస్‌, మిడ్‌వైఫ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) ట్రైనింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్‌సి,ఎస్‌టి,బిసి,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సిసి సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలించారు. కాగా హెల్త్‌ అసెస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050లు గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుం రూ.500లు, అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సి,ఎస్‌టి,బిసి,ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఒఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments