ముంబయి: మహారాష్ట్రలో మరాఠాలకు 16శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విభాగం కింద మరాఠాలకు రిజర్వేషన్ కల్పించారు. ఇక మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల అడ్మిషన్లలో 16శాతం రిజర్వేషన్ దక్కనుంది. మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల కమిషన్(ఎస్బిసిసి) ఇచ్చిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ గురువారం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఫఢ్నవీస్ ఎస్బీసీసీ ఇచ్చిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌తో పాటు కమిటీ మరాఠాల సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతుల గురించి అందించిన నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరాఠాలను రాష్ట్రంలో వెనుకబడిన వర్గంగా ప్రకటించారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ఆధారంగా వారు రిజర్వేషన్లు పొందడానికి అర్హులు అని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర జనాభాలో 30శాతం మంది మరాఠాలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. ఈ ఏడాది జులై, ఆగస్టులలో మరాఠాలు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లు
RELATED ARTICLES