రాణించిన అశ్విన్
రోహిత్ విజృంభణ
భారత్ 502/7 డిక్లేర్
36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
తొలి టెస్టు రెండో రోజు
విశాఖపట్నం: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా పట్టు సాధించింది. రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. డీఎన్ ఎల్గర్ (27), తెంబా బవుమా (2) నైట్ వాచ్‌మన్ క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ (5), డి బ్రూన్ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా… డేన్ పీడ్ (0) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా… జడేజాకు ఒక వికెట్ లభించింది. అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 136 ఓవర్లకు గాను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. టీమిండియా డిక్లేర్ చేసే సమయానికి రవీంద్ర జడేజా (30), రవిచంద్రన్ అశ్విన్ (1) అజేయంగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీయగా, ఫిలాండర్, డేన్ పీడ్త్, ముత్తుస్వామి, డీన్ ఎల్గర్‌లు తలో వికెట్ తీశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్(215; 371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి డబుల్ సెంచరీ సాధంచగా… ఓపెనర్ రోహిత్ శర్మ( 176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేయడంతో టీమిండియా ఐదు వందల పరుగుల మైలురాయిని అందుకుంది. మయాంక్ అగర్వాల్‌కు ఇదే టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ. 202/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ వికెట్‌ను కోల్పోయింది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.
మయాంక్ డబుల్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో మొత్తం 371 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ 23 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేసి ఎల్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సెంచరీ సాధించడానికి 204 బంతులు తీసుకున్న మయాంక్ అగర్వాల్ దానిని డబుల్ సెంచరీగా మలుచుకోవడానికి మరో 153 బంతులు మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో మొత్తంగా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్న 28 ఏళ్ల మయాంక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ. దీని ఫలితంగా దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు 2008లో వీరేంద్ర సెహ్వాగ్ దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తంగా డబుల్ సెంచరీ సాధించిన 23వ భారత ఆటగాడిగా మయాంక్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతకముందు దిలిప్ సర్దేశాయి, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 202/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది.
ఎన్నో రికార్డులు..
రెండో రోజైన గురువారం లంచ్ విరామ సమయానికి 88 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(138), పుజారా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. 202/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ నిలిచాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దాం. దక్షిణాఫ్రికా జట్టుపై సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు నిలిచారు. అంతేకాదు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో 1996/97లో కోల్‌కతా వేదికగా జరిగిన టెస్టులో గ్యారీ కిరెస్టన్, ఆండ్రూ హుడ్సన్‌లు నెలకొల్పిన 236 పరుగుల రికార్డుని అధిగమించారు.
300 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం
దక్షిణాఫ్రికా జట్టుపై 300 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మలు నిలిచారు. టెస్టు క్రికెట్‌లో భారత ఓపెనర్లు మూడొందలకు పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మలు నిలిచారు. టెస్టు క్రికెట్‌లో భారత ఓపెనర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఇలా రెండు సెంచరీలు చేయడం ఇది 10వసారి. చివరగా 2018లో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు సెంచరీలు సాధించారు.
2004లో కాన్పూర్ వేదికగా
ఇక, స్వదేశంలో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా మయాంక్-రోహిత్ శర్మలు నిలిచారు. ఈ క్రమంలో 2004లో కాన్పూర్ వేదికగా గౌతమ్ గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్‌లు నెలకొల్పిన 218 పరుగుల రికార్డుని వీరి బద్దలు కొట్టారు. గతేడాది టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్ తన ఐదో టెస్టులో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్‌కు కోల్పోయే సరికి భారత ఓపెనర్లు కొట్టిన సిక్సర్లు 9. దాంతో టెస్టు ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత జోడిగా మయాంక్-రోహిత్‌లు నిలిచారు. ఈ క్రమంలోనే నవజ్యోత్ సిద్ధూ, మనోజ్ ప్రభాకర్‌లు(1993-94 సీజన్), వీరేంద్ర సెహ్వాగ్-మురళీ విజయ్(2009-10 సీజన్)ల పేరిట సంయుక్తంగా ఉన్న 8 సిక్సర్ల రికార్డును రోహిత్-మయాంక్‌లు బద్ధలు కొట్టారు.
మయాంక్ మెరుపులు
RELATED ARTICLES