రాణించిన టాప్ ఆర్డర్
అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టిన మయాంక్
చెలరేగిన పుజారా, కోహ్లీ.. తొలి రోజు భారత్ 215/2
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించారు. మెల్‌బోర్న్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో మయాంక్ అగర్వాల్ (76), చతేశ్వర్ పుజారా(68 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. కోహ్లీ (47 బ్యాటింగ్) నిలకడమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి రెండు టెస్టుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన ఓపెనర్లు కెఎల్ రాహుల్, మురళీ విజయ్ మూడో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా బాక్సింగ్ డే టెస్టులో వారి స్థానంలో మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలకు తుది జట్టులో చాన్స్ లభించింది. కానీ మయాంక్ అంచనాలకు తగట్టు రాణించగా.. విహారి మాత్రం పేలవంగా ఆడాడు. తన కెరీర్ మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ రికార్డు అర్ధ శతకంతో టీమిండియాకు శుభారంభం అందించాడు. మరోవైపు తెలుగబ్బాయి హనుమ విహారి (8) విఫలమైనా మయాంక్ మాత్రం పుజారాతో కలిసి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ ఆవుటైన తర్వాత పుజారా, విరాట్ కోహ్లీలు అజేయంగా భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ (89 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.
నిరాశ పరిచిన విహారి..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని అందించారు. ఒకవైపు మయాంక్ దూకుడుగా ఆడుతుంటే.. మరోవైపు విహారి కుదురుగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. డ్రింక్స్ సమయానికి భారత్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. అనంతరం పుంజుకున్న ఆసీస్ బౌలర్ కమ్మిన్స్ భారత్‌కు తొలి షాకిచ్చాడు. సమన్వయంతో ఆడుతున్న హనుమ విహారి (66 బంతుల్లో 8) పరుగులను తెలివైన బంతితో స్లిప్‌లో ఉన్న ఫించ్‌చే క్యాచ్ పట్టించి పెవిలియన్ పంపాడు. దీంతో టీమిండియా 18.5 ఓవర్లలో 40 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన విహారి అందివచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేక నిరాశ పరిచాడు. ఓపెనర్‌గా చాన్స్ వచ్చిన రాణించలేక పోయాడు. ఎక్కువ బంతులు ఆడినా పరుగులు మాత్రం చేయలేకపోయాడు. మరోక ఓపెనర్ మయాంక్ మాత్రం లభించిన అవకాశాన్ని రెండుచేతులా ఒడిసి పట్టుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగాడు.
చెలరేగిన మయాంక్..
తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. మరోవైపు తమ వికెట్లను కూడా కాపాడుకుంటూ పోయారు. లంచ్ విరామ సమయానికి భారత్ 28 ఓవర్లలో 57/1 పరుగులు చేసింది. లంచ్ తర్వాత మయాంక్ దూకుడును మరింతగా పెంచాడు. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడతూ పరుగుల వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న మయాంక్ టెస్టు తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకుని రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం టెస్టులో అర్ధ శతకం సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ రికార్డు నెలకొల్పాడు. అంతకంటే ముందు 1947లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో భారత్ తరఫున దత్తు ఫాడ్కర్ (51) అరంగేట్రం టెస్టులో అర్ధ శతకం సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 71 ఏళ్ల తర్వాత మయాంక్ ఆ రికార్డును సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. అదే కాకుండా భారత్ తరఫున అరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా కూడా మయాంక్ నిలిచాడు. అతని కంటే ముందు శిఖర్ ధావన్, పృథ్వీ షా, గవాస్కర్, ఇబ్రహీం, అరుణ్, హుస్సెన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఒకవైపు పుజారా సమన్వయంతో ఆడుతుంటే.. మరోవైపు మయాంక్ మాత్రం దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఈ జంటను విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ పోవడంతో భారత్ 44.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. మరోవైపు వీరిద్దరూ రెండో వికెట్‌కు 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే అర్ధ శతకం అనంతరం మరింత దూకుడును పెంచిన మయాంక్ చివరికి వేగంగా ఆడే క్రమంలో కమ్మిన్స్ బౌలింగ్‌లో చిక్కాడు. టీ విరామానికి ఒక్క బంతి ముందు కమ్మిన్స్ వేసిన బౌన్సర్‌కు అంచనా వేయని మయాంక్ వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 123 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ (76; 161 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్)తో విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఇతను పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించాడు.
ఆదుకున్న పుజారా, కోహ్లీ…
అనంతరం క్రీజులోకి అడుగుపెట్టిన భారత సారథి విరాట్ కోహ్లీతో కలిసి మిస్టర్ డిపేండబుల్ చతేశ్వర్ పుజారా భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. వీరిద్దరూ మరో వికెట్ చేజారకుండా జాగ్రత్త పడుతూనే స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఆసీస్ బౌలర్ల బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పిచ్‌పై పాతుకుపోయారు. ఆరంభంలో కుదురుగా ఆడిన ఈ జంట తర్వాత సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులను సాధించారు. ఈ జంటను విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ తరచు బౌ లర్లను మార్చుతూ బౌలింగ్ చేయించినా ఫలితం దక్కలేదు. వీరిద్దరూ తమదైన శైలీలో గొప్పగా ఆడుతూ ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే 62.4 ఓవర్లలో 150 పరుగుల మార్కును దాటింది. మ రోవైపు కుదురుగా ఆడుతున్న పుజారా కూడా 152 బం తుల్లో 4 ఫోర్ల సహకారంతో హాఫ్ సెంచరీ సాధించాడు. పుజారాకు టెస్టులో ఇది 21 హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరోవైపు కోహ్లీ అడపాదడపా పరుగులు తీస్తూ ఇతనికి అండగా నిలిచాడు. ఆసీస్‌కు తలనొప్పిగా మా రిన ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎంతగా నో శ్రమించారు. కానీ వీరిద్దరూ పిచ్‌పై గట్టిగా నిలబడిపోయి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ఈ క్ర మంలోనే వీరు మూడో వికెట్‌కు 93 బంతుల్లోనే కీలకమైన 50 పరుగులు భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నా రు. అనంతర డ్రింక్స్ విరామం సమయానికి భారత్ 72 ఓవర్లలో రెండు వికెట్ల సష్టానికి 174 పరుగులు చేసింది. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ భారత్‌కు గట్టి పునాది వేశారు. టాప్ ఆర్డర్ సమస్యను అధిగమిస్తూ గొప్పగా ఆడారు. తొలి రోజు బ్యాటింగ్‌లో ముగ్గురూ టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్స్ రాణించడం సంతోషకరమైన విషయమే. విహారి మినహా ముగ్గరూ బ్యాట్స్‌మన్లు తమవంతు గొప్ప ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. డ్రింక్స్ తర్వాత కూడా కోహ్లీ, పుజారాలు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. వీరిద్దరూ కంగారూ బౌలర్లకు కంగారు పెట్టిస్తూ వారి సహనానికి పరీక్ష పెట్టారు. ఈ జోడీని విడదీయడానికి ఎంతగానో శ్రమించారు. తరచు బౌలర్లు మార్చుతూ ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి లభం దక్కలేదు. ఈ క్రమంలోనే భారత్ 82.5 ఓవర్లలో 200 పరుగుల మైలు రాయిని పూర్తి చేసుకుంది. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు (89 ఓవర్లలో) 215/2 పరుగులు చేసింది. మరోవైపు అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్న పుజారా, కోహ్లీలు మూడో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించారు. సమన్వయంతో ఆడిన చతేశ్వర్ పుజారా (200 బంతుల్లో 6 ఫోర్లతో 68), కుదురుగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (107 బంతుల్లో 6 ఫోర్లతో 47) పరుగులు చేసి నాటౌట్‌గా క్రీజులో నిలిచున్నారు. మొదటి రెండు టెస్టులో చెలరేగిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ల ముందు తేలిపోయాడు. వికెట్లు తీయడానికి ఎంతగానో శ్రమించినా ఇతనికి ఫలితం లభించలేదు. మొత్తం 21 ఓవర్లు వేసిన లియాన్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్‌కే రెండు వికెట్లు లభించాయి.