‘పీరియడ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు
లాస్‌ఎంజిల్స్: గ్రామీణ భారతీయ మహిళల సమస్యలను చిత్రీకరించిన ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యుమెంటరీ చిత్రానికి 91 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డును దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీ చిత్రానికి రైఖా జెతాబ్సి దర్శకత్వం వహించింది. గునీత్ మోంగా నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని హపూర్‌లో చిత్రీకరించారు. రుతు చక్ర సమయంలో వాడటానికి సరియైన ప్యాడ్‌లు లేక చాలామంది బాలికలు పాఠశాలలకు మానేయడంతోపాటు ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారని చిత్రంలో మహిళా సమస్యను ఎలుగెత్తి చాటారు. శానిటరి ప్యాడ్ తయారీ యంత్రాన్ని నెలకొల్పి స్వంతంగా ప్యాడ్‌ల తయారీ చేపట్టి మహిళా శక్తిని చాటే కథనంతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును దక్కించుకుంది.అయితే ఇదే అంశంతో అక్షయ్‌కుమార్ హీరోగా ప్యాడ్‌మ్యాన్ చిత్రం విడుదలై విజయం సాధించిన విషయం విదితమే. భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రావడంపై పలువురు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.