బాలేశ్వర్ (ఒడిశా) : భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్రిపణి వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఎంఆర్‌ఎస్‌ఎఎంగా వ్యవహరించే ఈ వ్యవస్థను డిఆర్‌డిఒ ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్షించింది. ఈ ప్ర యోగం విజయవంతమైంది. నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి నేరుగా ఛేదించిందని డిఆర్‌డిఒ ఒక ప్రకటనలో తెలిపింది. భారత సైన్యం భాగస్వామ్యంతో ఈ ప్రయోగాన్ని పూర్తి చేసినట్టు తెలిపింది. సుదూరంలో ఉన్న హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించగలిగిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్‌తో కలిసి క్షిపణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించింది. భారత్ నుంచి డిఆర్‌డిఒ, ఇజ్రాయిల్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇజ్రాయిల్ ఏరోస్పేస ఇండస్ట్ల్రీలకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే భారత వాయుసేన అమ్ముల పొదిలే చేరిన ఎంఆర్‌ఎస్‌ఎఎం వ్యవస్థను ఇప్పుడు సైన్యం అవసరాలకు ఉపయోగపడేందుకు ప్రయోగాలు జరపుతున్నారు. విమానాలు, హెలికాప్టర్లు, యాంటిషిప్ మిసైళ్లను భారత్ ఆదివారం ప్రయోగించిన క్షిపణి వ్యవస్థ సమర్థంగా అడ్డుకోగలది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను సైతం అడ్డుకోగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ క్షిపణి సుమారు అరవై కిలోల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలవు. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్ పల్స్ రాకెట్ మోటర్‌ను ఈ క్షిపణిలో వినియోగించడం విశేషం. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా ఎలాంటి లక్ష్యాలనైన ఛేదించే సత్తా ఈ క్షిపణి వ్యవస్థకు ఉంది.
మధ్యశ్రేణి క్షిపణి ప్రయోగం సక్సెస్
RELATED ARTICLES