నగర వ్యాప్తంగా వదంతులు
షికార్లు చేసిన పుకార్లు
మందు బాబుల హైరానా
వైన్ షాపులకు పరుగులు
నగరంలో పలు చోట్ల మందుబాబులను చెదరగొట్టిన పోలీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : మద్యం దుకాణాలు మరోసారి బంద్ చేస్తారనే వదంతులు నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వ్యాపించాయి. శుక్రవారం మధ్యాహ్నం తరువాత హైదరాబాద్‌లో మద్యం దుకాణాలను ప్రభుత్వం బంద్ చేస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మందుబాబులు హైరనా పడ్డారు. వైన్ షాపులకు పరుగులు తీశారు. ఒక్కసారి జనం వైన్‌షాపులకు రావడంతో పోలీసులు వెళ్లగొట్టారు. సాయంత్రం ఐదు గంటల తరువాత వైన్‌షాపుల వద్దకు పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు వచ్చారు. ఆరు తరువాత షాపులను పోలీసులు బంద్ చేయించారు. అక్కడే గుమిగుడి ఉన్న మందుబాబులను పోలీసులు చెదరగొట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో 46రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేసిన విషయం తెల్సిందే. మద్యం దుకాణాలు బంద్ ఉన్న సమయంలో మద్యం బ్లాక్ మార్కెట్ జోరుగా సాగింది. భారీ ధరలకు మద్యాన్ని విక్రయించారు. పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించి మరీ మద్యాన్ని కొనుగోలు చేశారు. మద్యం దుకాణాలు బంద్ చేస్తారనే వదంతులు నమ్మిన మందుబాబులు హైరానాకు గురయ్యారు.
మద్యం షాపులు బంద్?
RELATED ARTICLES