ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు : నిమ్స్‌కు తరలింపు
ఆసుపత్రిలోనూ కొనసాగుతున్న దీక్ష
అరెస్టును ఖండించిన వామపక్ష, ప్రజాసంఘాలు
నిమ్స్‌లో కూనంనేనిని పరామర్శించిన చాడ, విహెచ్, మోత్కుపల్లి, ఆర్ కృష్ణయ్య
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం అర్థరాత్రి పోలీసులు అక్రమంగా మఖ్దూంభవన్‌లోని దీక్షా శిబిరంలోకి చొరబడి కూనంనేనితో పాటు ఆయనకు సంఘీభావంగా రిలే దీక్షలో ఉన్న నేతలను అరెస్టు చేశారు. అర్ధరాత్రి 1.30 నుండి 2 గంటల మధ్య ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. అందరూ నిద్రించిన తర్వాత పోలీసులు దీక్షా శిబిరంలోకి చొరబడి సాంబశివరావును పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగితా వారిని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అప్రజాస్వామికంగా అర్ధరాత్రి దీక్షా శిబిరాన్ని భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కాగా కూనంనేసి సాంబశివరాకు నిమ్స్ ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన హుషారుగా, ఉత్సాహంగా ఉన్నారు. సమ్మె పరిష్కారంపై ప్రభుత్వం స్పందించేంత వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని ప్రకటించారు. సోమవారానికి ఆయన దీక్ష మూడోరోజుకు చేరుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూ నంనేని సాంబశివరావును సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, సిపిఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాల మల్లేశ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ శాసనసభ్యులు, బిసి నేత ఆర్. కృష్ణయ్య, ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియ న్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విఎస్ బోస్, శ్రా మిక మహిళా పీఠం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేంపావని, ఎఐటియుసి నా యకులు ఉజ్జిని రత్నాకరరావు, ఎం. నర్సింహా, ఆ రుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, టి. వెంకట్రాములు (వ్యవసాయ కార్మిక సంఘం), అంజయనాయక్ (గిరిజన సమాఖ్య), తో పాటు సిపిఐ నాయకులు, ప్రజాసంఘాలు కార్మిక సంఘాల నాయకులు సంఘీ భావం తెలిపారు.