దుబాయ్: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. శనివారం ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మంధనా (751) రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మంధనా తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకుంది. తొలి వన్డేలో శతకం కొట్టిన మంధనా రెండో వన్డేలో అజేయంగా 90 పరుగులు చేసింది. దీంతో రెండు ర్యాంక్‌లు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌వుమెన్స్ పెర్రీ, మెగ్ లన్నింగ్స్‌లను వెనుకకు నెట్టి టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. గత ఏడాది అద్భుతంగా రాణించిన మంధనా భారత్‌కు ఎన్నో విజయాలు అందించింది. 2018లో 15 వన్డే మ్యాచ్‌లు ఆడిన మంధనా రెండు సెంచరీలతో పాటు, 8 హాఫ్ సెంచరీలు చేసింది. గత ఏడాది మంధనాకు బాగా కలిసి వచ్చింది. ఇక భారత వన్డే కెప్టెన్, తాజాగా 200వ వన్డే ఆడిన మిథాలీ రాజ్ 4వ ర్యాంక్‌లో నిలిచింది. యువ క్రీడాకారిణి జెమీమా రొడ్రిగ్స్ మూడు ర్యాంక్‌లు ఎగబాకి 61వ ర్యాంక్‌కు చేరింది. ఈ 18 ఏళ్ల యువ క్రీడాకారిణి గత ఏడాది మార్చిలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. అద్భుతంగా రాణిస్తూ జట్టులో మంచి పేరుసంపాదించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 81 పరుగులు చేసి తన సత్తా చాటుకుంది. ఇక బౌలింగ్‌లో రాణిస్తున్న పూనమ్ యాదవ్, దీప్తి శర్మలు చెరో ఐదు స్థానాలు ఎగబాకి టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. పూనవ్ యాదవ్ (581 పాయింట్లు) 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటే.. దీప్తి శర్మ (578 పాయింట్లు) 9వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక భారత ప్రధాన బౌలర్ ఝులన్ గోస్వామి (639) పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఆలౌరౌండర్ జాబితాలో భారత్ తరఫున దీప్తి శర్మ (329) పాయింట్లతో నాలుగో ర్యాంక్ దక్కించుకుంది.
మంధనా టాప్
RELATED ARTICLES