అధికార పార్టీ సీనియర్ ఎంఎల్‌ఎలలో అదే పరిస్థితి
సీట్లు, మెజారిటీపై భయాందోళన
ఇద్దరు అమాత్యుల వారసులు పోటీ చేసిన స్థానాలపై ఉత్కంఠ
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర మంత్రుల్లో ‘ఎలక్షన్’ టెన్షన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో లోక్‌సభ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంంలో ఎన్ని స్థానాలు? ఎంత మెజా ర్టీ? ఏ స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందనేది మం త్రులు, టిఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్ ఎంఎల్‌ఎలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు వస్తాయని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నప్పటికీ ఎంత మేరకు మెజా ర్టీ వస్తుంది..? ఎక్కడ గట్టి పోటీ ఉంటుంది.. ఆ ప్రభావం తమ రాజకీయ భవిష్యత్‌పై పడుతుం దా..? అనేది మంత్రులు, టిఆర్‌ఎస్‌లోని కొం దరు సీనియర్ ఎంఎల్‌ఎలలో భయందోళన మొదలైంది. వివిధ ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం టిఆర్‌ఎస్‌కు దాదాపు 12 నుంచి 14 వరకు ఎంపి సీట్లు వస్తాయని ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన ఆ రెండు లేదా ఆపైన ఉన్న స్థానాలకు బాధ్యత వహించిన మంత్రులు, సీనియర్ నేతలు, అక్కడి ఎంఎల్‌ఎలకు భయం పట్టుకున్నది. మరి కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎంత మెజార్టీ వస్తుందనే అంశంపై కూడా ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. “సారు..కారు.. పదహారు” అనే నినాదంతో వెళ్లిన టిఆర్‌ఎస్, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో గతానికంటే ఎక్కువ మెజార్టీ రావాలని అక్కడి ముఖ్యనేతలకు టార్గెట్ విధించారు.
ముఖ్యంగా రెండు స్థానాల్లో ఇద్దరు మంత్రుల వారసులను రంగంలోకి దింపిన నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది టిఆర్‌ఎస్‌తో సహా ఇతర రాజకీయ వర్గాల్లో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆ రెండు స్థానాలను అన్నీ తామై నడిపించిన నేపథ్యంతో సదరు మంత్రుల రాజకీయ భవిష్యత్తును ఆ ఫలితాలే నిర్ణయిస్తుందనేది సొంత పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. జూన్ మొదటి వారం తర్వాత టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పూర్తి గా పరిపాలన ప్రక్రియపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి మంత్రి వర్గవిస్తరణ, మరిన్ని నామినేటెడ్ పదవు లు ఇలా పదవుల పర్వం మొదలుకానుంది. ఇలాంటి పరిస్థితుల్లో