ఛేదించిన సైబరాబాద్ పోలీసులు
రూ 15 కోట్ల సుపారీ
ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
ప్రజాపక్షం / రంగారెడ్డి రాష్ట్ర ఎక్సెజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ వ్యవహారంలో సుపారీ గ్యాంగ్ తో వారిని హత్య చేయించేందుకు కుట్ర పన్నిన మహబూబ్‌నగర్‌కు చెందిన ఎనిమిది మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకుట్రకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కమిషనర్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ వాసులు కొందరు సుపారీ గ్యాంగ్‌తో రూ.15 కోట్లకు ఒప్పందం చేసుకునే ప్రయత్నం జరిగిందన్న ఫిర్యాదు అందినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇందులో రాఘవేందర్ రాజు, మధుసూదనరాజు, మున్నూరు రవి, నాగరాజు, మైత్రి యాదయ్య, విశ్వనాథ, జితేందర్‌రెడ్డి డ్రైవర్ దఫా, పిఎ రాజును అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కుట్ర భయటపడుతుందనే భయంతో ఫరూఖ్‌పై గత నెల 23వ తేదీన కొంతమంది దాడి జరిపారని అన్నారు. ఫరూక్ ఫిర్యాదు ఆధారంగా నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నాగరాజు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ వెళ్లిన పోలీసులు అక్కడ బిజెపి నేత జితేందర్‌రెడ్డి నివాసంలో రఘు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు వివరించారు. కుట్రకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ తెలిజేస్తూ “ నిందితులను ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. 27న జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాగరాజు కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో కొన్ని విషయాలు చెప్పాడు. రాఘవేంద్ర రాజు, కొందరితో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆ తర్వాత విచారణ జరుపగా రాఘవేందర్ రాజు, మున్నూర్ రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. వీరికి గురించి సమాచారం లేదని. వారి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి సర్వెంట్ క్వార్టర్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. రాఘవేందర్ రాజు, రవి, మధుసూదన్, అమరేందర్ కలిసి మహబూబ్‌గర్ నుంచి వైజాగ్ వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి షెల్టర్ తీసుకున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చింది మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి డ్రైవర్, పిఎ రాజు అని విచారణలో తేలింది. వీళ్లందరిని సర్వెంట్ క్వార్టర్‌సలో నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. వారిని ప్రశ్నించగా కుట్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలను రికవరీ చేశాం. రాఘవేందర్ రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్, దుండిగల్ ఫారెస్ట్ ఏరియాలో 6 రౌండ్స్ రివాల్వర్ రాజు నుంచి రికవరీ చేసి ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించాం. రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలింది” అని కమిషనర్ వివరించారు. కేసు వివరాల్లోకి వెళితే.. రాఘవేందర్ రాజు మొదటి ఫరూక్ను కలిశాడు. ఫరూక్ కూడా నేర చరిత్ర ఉన్నది. మంత్రిని హత్య చేయాలని.. నువ్వు చేసినా సరే.. వేరే ఎవరినా కలిపిస్తే వారితో చేయిస్తామని ప్రణాళిక వేశారు. హత్య కోసం రూ.15కోట్ల వరకు సుపారీ ఇవ్వచూపారు. హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం. కుట్రలో రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేందర్ రాజు, మధుసూదన్, షెల్టర్ ఇచ్చిన వ్యక్తితో మరో ముగ్గురు భాగస్వాములైనట్లు విచారణలో తెలిసింది. హత్య కేసుకు ప్రధాన సూత్రధారులు మధుసూదన్, అమరేందర్రాజు అని, హత్య కోసం రూ.15కోట్లు సుపారీ ఇవ్వజూపారు. నిందితులను రిమాండ్కు తరలించాం. పోలీసు కస్టడీలోకి నిందితులను తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం’ అని వివరించారు. ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. ఆయుధాలను రాజు యూపీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణల పాత్రపై వస్తున్న వార్తల గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా, ఆ విషయాలపై లోతుగా దర్యాప్తుచేస్తున్నామని, నిందితులను పోలీసు రిమాండ్‌కు తీసుకుని ప్రశ్నించిన తరువాత వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ సమాధానమిచ్చారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర
RELATED ARTICLES