HomeNewsTelanganaమంత్రి నిర్మల ప్రసంగం అబద్ధాల పుట్ట

మంత్రి నిర్మల ప్రసంగం అబద్ధాల పుట్ట

శ్రామిక వర్గానికి, ప్రజలకు ఎంత మాత్రం బడ్జెట్‌ దోహదపడేలా లేదు
ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన ఒక డాక్యుమెంట్‌గా ఉన్నది
ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ శ్రామిక వర్గానికి, ప్రజలకు ఎంత మాత్రం దోహదపడేలా లేదని ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శించారు. పార్లమెంట్‌ సాక్షిగా నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగం ఒక అబద్దాల పుట్ట అని, ఓట్‌ అన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన ఒక డాక్యుమెంట్‌గా ఉన్నదని ఎద్దేవా చేశారు. వేతనాలు 50 శాతం పెరిగాయని, కాంట్రాక్ట్‌ విధానాన్ని తొలగించి, రెగ్యులరైజ్‌ చేశామని పచ్చి అబద్దాలు చెప్పారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో పచ్చి అబద్దాల చెప్పడం సిగ్గుచేటన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు నరేంద్రమోడీ ప్రభుత్వం దోచిపెడుతోందనిధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న, అమలు చేస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాలు, కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 16న దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను,గ్రామీణ భారత్‌బంద్‌ను, పోరాటాన్ని విజయవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సకు అమర్‌జీత్‌ కౌర్‌ ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, గ్రామీణబంద్‌, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి, ప్రధాని మోడీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌ అదానీకి, అంబానీకి తప్ప శ్రామికవర్గానికి, ప్రజలకు ఎంత మాత్రం మేలు చేసేలా లేదని మండిపడ్డారు. 50 శాతం పేదరికం తొలగిపోయిందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, గద్దెనెక్కి న ప్రభుత్వం విద్యావంతులైన నిరుద్యోగులతో చెలగాడం అడుతోందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు నివారించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గోరంగా విఫలమైందని, నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్‌ ప్రకారం ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రైతుల జీవితాలు దుర్మర్గంగా మారాయని చెప్పారు. యూనియన్‌ పెట్టుకునే హక్కు లేకుండా సమస్యల పరిష్కారానికి సమ్మె చేయకుండా నాలుడు కోడ్‌లను తీసుకొచ్చి, కార్మికుల హక్కులపైన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఆయోధ్యలో మందిరం పూర్తికాకుండానే రామమందిర ప్రారంభోత్సవం చేసి రాముని పేరుతో రాజకీయం చేస్తూ మళ్లీ ఎన్నికల్లో గెలువాలన్న దుర్బుద్దితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహారిస్తోందన్నారు. ప్రధాని మోడీ కార్మికుల ప్రజల పక్షాన లేరని, అదానీ, అంబానీ వైపు ఉన్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాధ్యక్షత వహించిన ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్‌ మాట్లాడుతూ అన్ని సెక్టార్‌లతో పాటు గ్రామీణ సమ్మె నిర్వహించాలని పిలుపునిచ్చారు. 73 రకాల పనులు చేసే వారికి 73 జివోలను జారీ చేయకుండా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్‌ మాట్లాడుతూ కార్పొరేట్లకు, పెట్టుబడిదారలుకు మేలు చేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతు వ్యతిరేక మూడు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. కులాలు,మతాల మధ్య చిచ్చుపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందన్నారు. ఇప్పటికే 47 కోట్ల మంది కట్టెలతో వంట చేసుకుంటున్నారని, దేశంలో పేదరికం ఉన్నదనేందుకు ఇంతకంటే ఉదాహరణ ఏమిటని బాలరాజ్‌ ప్రశ్నించారు. పేదల, కార్మికుల, రైతు వ్యతిరేక ప్రభుత్వ మోడీని గద్దె దించేందుకు ఈ నెల 16న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలుత ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ్మ స్వాగతోపన్యాసం చేయగా, వేదికపైన బి.చంద్రయ్య, పి.ప్రేంపావని, ఎఐటియుసి సీనియర్‌ నాయకులు వి.ఎస్‌.బోస్‌, రామాంజనేయులు, ఓరుగంటి యాదయ్య, వేదికపైన ఆసీనులయ్యారు. ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి వందన సమర్పన చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments